ఫొటో స్టోరీ: ముందడుగు (Krishna-Sobhan Babu)

ABN , First Publish Date - 2022-07-17T04:35:20+05:30 IST

నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏయన్నార్ నటించిన 'గుండమ్మ కథ' చిత్రం తర్వాత మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్న మల్టీ స్టారర్ మూవీ 'ముందడుగు'. ఈ చిత్రంలో నటించిన నట శేఖర కృష్ణ, నట భూషణ శోభన్ బాబు ఆ సమయంలో టాప్ స్టార్స్. అందుకే సినిమాలో ఎక్కువ తక్కువలు లేకుండా వీరిద్దరి పాత్రలు సమాన స్థాయి కలిగి ఉంటాయి.

ఫొటో స్టోరీ: ముందడుగు (Krishna-Sobhan Babu)

నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏయన్నార్ నటించిన 'గుండమ్మ కథ' చిత్రం తర్వాత మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్న మల్టీ స్టారర్ మూవీ 'ముందడుగు'(Mundadugu). ఈ చిత్రంలో నటించిన నట శేఖర కృష్ణ, (Krishna)నట భూషణ శోభన్ బాబు (Sobhan babu)ఆ సమయంలో టాప్ స్టార్స్. అందుకే సినిమాలో ఎక్కువ తక్కువలు లేకుండా వీరిద్దరి పాత్రలు సమాన స్థాయి కలిగి ఉంటాయి. ఈ చిత్రంలో కోటీశ్వరుడైన చక్రవర్తిగా శోభన్ బాబు, లారీ డ్రైవర్ బాలగంగాధర తిలక్ గా కృష్ణ నటించారు. ఢీ అంటే ఢీ అనే పాత్రలు వీరిద్దరివి. అద్భుతంగా నటించి ఆ పాత్రలకు న్యాయం చేకూర్చారు కృష్ణ, శోభన్ బాబు. కృష్ణ కు అద్భుతమైన డైలాగులు, శోభన్ బాబుకు మంచి పాటలు కుదిరాయి. హీరోయిన్లు జయప్రద, శ్రీదేవిలలో శ్రీదేవి పాత్ర బాగుంటుంది. మిగిలిన పాత్రలు కూడా బాగుండటం తో సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా సాగుతుంది. కథ, కథనాల మీద నిర్మాత రామానాయుడు, (D. Ramanaidu)దర్శకుడు బాపయ్య (Bapaiah)ప్రత్యేక దృష్టి పెట్టి, ఇద్దరి హీరోలను సంతృప్తి పరుస్తూ ఆద్యంతం ఆసక్తి కారంగా సినిమా తీసి ఇద్దరి హీరోల అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. అలాగే పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు హైలైట్ గా నిలిచాయి. సురేష్ సంస్థలో వారికి ఇదే తొలి చిత్రం. 'ముందడుగు' చిత్రం 18 కేంద్రాల్లో వంద రోజులు, 6 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఈ సందర్భంగా 1983 ఆగస్టు 28న చెన్నైలోని తాజ్ కోరమాండల్ హోటల్ లో రజతోత్సవం నిర్వహించారు రామానాయుడు. ఈ కార్యక్రమంలో జితేంద్ర, శక్తి కపూర్, కృష్ణంరాజు, చిరంజీవి, మురళీ మోహన్, ఎమ్మెస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Mundadugu silver jubilee function)




Updated Date - 2022-07-17T04:35:20+05:30 IST