Mumtaz : అమెరికాలో భర్త వివాహేతర సంబంధం... ఇండియాలో మాజీ హీరోయిన్ extra marital affair

ABN , First Publish Date - 2022-05-15T00:36:13+05:30 IST

సీనియర్ నటి ముంతాజ్ (Mumtaz) తన తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె తన ఒకప్పటి వివాహేతర సంబంధం గురించి తెలియజేసింది. భర్తకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసి... ఒంటరితనంతో, బాధతో తాను కూడా ఇంకొక వ్యక్తికి శారీరికంగా దగ్గరయ్యానని గతాన్ని గుర్తు చేసుకుంది. పెళ్లి తరువాత భర్తతో అమెరికా వెళ్లిన ముంతాజ్ అక్కడ...

Mumtaz : అమెరికాలో భర్త వివాహేతర సంబంధం... ఇండియాలో మాజీ హీరోయిన్ extra marital affair

సీనియర్ నటి ముంతాజ్ (Mumtaz) తన తాజా ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె తన ఒకప్పటి వివాహేతర సంబంధం గురించి తెలియజేసింది. భర్తకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసి... ఒంటరితనంతో, బాధతో తాను కూడా ఇంకొక వ్యక్తికి శారీరికంగా దగ్గరయ్యానని గతాన్ని గుర్తు చేసుకుంది. పెళ్లి తరువాత భర్తతో అమెరికా వెళ్లిన ముంతాజ్ అక్కడ ఆయన మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలిశాక తట్టుకోలేకపోయిందట. వెంటనే ఇండియాకు తిరిగి వచ్చేసింది. అటువంటి సమయంలో, ఆమె ‘ముళ్ల బాటపై నడుస్తుండగా మరొకరు గులాబీ’తో దగ్గరయ్యారట. అతను చూపిన ప్రేమకి తాత్కాలికంగా పరవశించిన ఆమె కొన్నాళ్లు ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్ నడిపినట్లు ఒప్పుకుంది.


1974లో మయూర్ మధ్వానీని పెళ్లాడిన ముంతాజ్ వయస్సు, ఇప్పుడు 74 ఏళ్లు. అయితే, పెళ్లైన కొత్తలో ఆమె భర్త తనకు అమెరికన్ అమ్మాయి ఒకరితో సంబందం ఉందని స్వయంగా చెప్పాడట. అది విన్న ముంతాజ్ ఆగ్రహానికి, ఆవేదనకి లోనై ఇండియాకి తిరిగి వచ్చేసింది. సరిగ్గా అప్పుడే మరో వ్యక్తితో ఆమె సంబంధం ఏర్పరుచుకుంది. కానీ, కొన్నాళ్లకే ఆ వివాహేతర వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి భర్తతో కాపురం కొనసాగించింది. తరువాత తన భర్త ఏనాడూ తనని మరే విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదని చెప్పిన ముంతాజ్, ఇప్పటికీ, ఆయన ఎంతో కేర్ తీసుకుంటారని తెలిపింది! 

Updated Date - 2022-05-15T00:36:13+05:30 IST