Mahesh Babu: సూపర్‌స్టార్ కామెంట్స్‌పై బాలీవుడ్‌ నిర్మాత రియాక్షన్ ఇదే..

ABN , First Publish Date - 2022-05-12T16:08:27+05:30 IST

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ స్టార్ నిర్మాతగా...

Mahesh Babu: సూపర్‌స్టార్ కామెంట్స్‌పై బాలీవుడ్‌ నిర్మాత రియాక్షన్ ఇదే..

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ నన్ను తట్టుకోలేదు’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై మహేశ్ వివరణ ఇస్తూ బాలీవుడ్ అవమానించాలని కాదని, అన్ని భాషలపై తనకు గౌరవం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. అందులో కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతుండగా.. మరికొందరు మాత్రం నెగటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేశ్ భట్ (Mukesh Bhatt) స్పందించాడు. 


ముఖేశ్ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ మహేశ్‌కి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోవచ్చు. ఆయన భాషను, పనిచేసే ప్రదేశాన్ని గౌరవిస్తాను. ఆయనకు ప్రతిభ‌ ఉంది. ఆ ప్రతిభకి సంవత్సరాలుగా మంచి ఆదాయమే వస్తుండొచ్చు. విజయవంతమైన నటుడిగా ఆయనను మన చిత్రాలు సంతృప్తి పరచలేకపోవచ్చు. ఆయన అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు. కానీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు. ఆయనకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-05-12T16:08:27+05:30 IST