Ms Marvel: హాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో India-Pakistan Partition సీన్స్.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-06-30T19:48:16+05:30 IST

‘అవెంజర్స్’.. ఈ హలీవుడ్ సినిమాల సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న..

Ms Marvel: హాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో India-Pakistan Partition సీన్స్.. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

‘అవెంజర్స్’.. ఈ హలీవుడ్ సినిమాల సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో ఇప్పటికీ 27పైగా సినిమాలు, పలు వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. అన్ని కూడా మంచి ప్రేక్షకాదరణని పొందాయి. ఈ సిరీస్‌లో తాజాగా విడుదలైన వెబ్‌సిరీస్‌ ‘మిస్ మార్వెల్ (Ms Marvel)’. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సిరీస్ కమాలా ఖాన్ అనే పాకిస్థానీ టినేజ్ సూపర్ వుమెన్ స్టోరీతో తెరకెక్కింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్స్ విడుదలయ్యాయి.


తాజాగా విడుదలైన ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటుడు ఫరాన్ అఖ్తర్ (Farhan Akhtar) కూడా నటించడం విశేషం. ఎంతో కీలకమైన సీన్‌లో కమాలాని ఫరాన్ సేవ్ చేస్తాడు. దానికి గురించి ఫరాన్ ట్వీట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్‌లో.. ‘మీకు వలీద్‌ని పరిచయం చేయడం నాకు సంతోషంగా అనిపించింది! డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో వస్తున్న మిస్ మార్వెల్ తాజాగా ఎపిసోడ్‌లో నన్ను చూడొచ్చు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన Ms Marvel నాలుగు ఎపిసోడ్‌లు.. ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీషులో ప్రసారం అవుతున్నాయి’ అని రాసుకొచ్చాడు.


అంతేకాకుండా ఈ ఎపిసోడ్‌లో 1947 స్వాతంత్య్రం తర్వాత బ్రిటీష్ ఇండియా భారత్, పాకిస్తాన్‌గా విడిపోయే సీన్స్‌ని చూపించారు. ఆ సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడి లక్షలాది మంది ప్రజలు మైగ్రేట్ అయ్యారు. వారికి సంబంధించిన సీన్స్‌ని ఎంతో హృద్ర్యంగా చూపించారు. అది చూసిన పలువురు ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ‘ఆ సంఘటనని నేను పుస్తకాల్లో చదివి ఊహించుకున్నట్లుగానే ఈ వెబ్‌సిరీస్‌లో చూపించారు’ అని ఓ నెటిజన్.. ‘మిస్ మార్వెల్‌లోని విభజన దృశ్యాలు నిజంగా భయానకంగా ఉన్నాయి. అవి బ్రిటిష్ వల్ల ఎదురైన నిజమైన భయాన్ని చూపించాయి. ఆ సన్నివేశాలు ముస్లింలు, ఇతర వలసదారుల హృదయాలలో స్థానం సంపాదించాయి. ఇది మార్వెల్ స్టూడియోస్ రూపొందించిన అద్భుత కళాఖండం’ అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.













Updated Date - 2022-06-30T19:48:16+05:30 IST