Dhoni Entertainment: ధోనీ నిర్మాతగా విజయ్ సినిమా..!

ABN , First Publish Date - 2022-10-13T22:08:19+05:30 IST

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) దేశానికి అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

Dhoni Entertainment: ధోనీ నిర్మాతగా విజయ్ సినిమా..!

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) దేశానికి అందించిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతడు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను అందించాడు. ఐసీసీ ట్రోఫీలను దేశానికి తీసుకొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెట్‌కు బై బై చెప్పిన ధోనీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో అతడు ఉన్నట్టు సమాచారం.  


మహేంద్ర సింగ్‌ ధోనీ ఇప్పటికే ‘ధోనీ ఎంటర్‌టైన్మెంట్‌’ (Dhoni Entertainment) అనే సంస్థని ప్రారంభించాడు. ‘ది రోర్‌ ఆఫ్‌ ది లయన్‌’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థపై పూర్తి స్థాయి చిత్రాలు నిర్మించాలని ఆలోచనలో ఉన్నాడట. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. అందువల్ల చెన్నైతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ‘ధోనీ ఎంటర్‌టైన్మెంట్‌కు’ చెందిన శాఖకు చెన్నైలో ప్రారంభించనున్నాడని సమాచరం. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ (Vijay) 70వ చిత్రానికి ధోనీ నిర్మాతగా వ్యవహరించనున్నాడని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను దీపావళి రోజున వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు మీడియాలో వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ‘వారసుడు’ (Varasudu) లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే లోకేశ్ కనకరాజ్, అట్లీలతో సినిమాలు చేయాలి. అనంతరం విజయ్ నటించే 70వ చిత్రాన్ని ధోనీ ప్రొడ్యూస్ చేస్తాడని సమాచారం.

Updated Date - 2022-10-13T22:08:19+05:30 IST