బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘Jersey’.. నానినే కారణం అంటున్న హీరోయిన్

ABN , First Publish Date - 2022-05-06T15:17:37+05:30 IST

‘కబీర్ సింగ్’ సక్సెస్ తర్వాత బాలీవుడ్ యువ నటుడు షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. 2019లో విడుదలై..

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘Jersey’.. నానినే కారణం అంటున్న హీరోయిన్

‘కబీర్ సింగ్’ సక్సెస్ తర్వాత బాలీవుడ్ యువ నటుడు షాహిద్ కపూర్ నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ యువ నటుడు నాని ‘జెర్సీ’కి రిమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. దీనికి సైతం మాతృకకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే డైరెక్టర్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఇందులో షాహిద్, మృణాల్ నటనకి, కథ, ఇతర నటీనటుల పర్ఫామెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం 20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్‌ మ‌ృణాల్ ఠాకూర్ స్పందించింది.


మృణాల్ మాట్లాడుతూ.. ‘జెర్సీ ఫలితం నన్ను ఎంతో నిరుత్సాహపరిచింది. ఇందులో ఫర్ఫామెన్స్‌ బాగానే ఉన్నప్పటికీ విడుదలైన సమయం, మార్కెటింగ్ వంటి కారణాలు కలెక్షన్లని ప్రభావితం చేసి ఉండొచ్చు. వీటికి సంబంధించి మేం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. బహుశా ఇది ఒక దశ కావొచ్చు. అలాగే ఇంకా వేరే కారణాలు చాలా ఉండొచ్చు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయితే మంచి సినిమాకి ఇలాంటి ఫలితం రావడం కొంచెం బాధగానే ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నేను కొంచెం నిరాశలో ఉన్నాను. ఇవన్నీ పక్కన పెడితే తదుపరి చిత్రం కోసం మరింత కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.


మృణాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా విడుదలై మూడు వారాలు అవుతోంది. అయినప్పటికీ సినిమాని చూసేందుకు ఆడియన్స్ ఇంకా థియేటర్స్‌కి వస్తున్నారు. మూవీ క్రేజ్ మెల్లిగా పుంజుకుంటోంది. అయితే ఇప్పటికే నాని చిత్రం ‘జెర్సీ’ హిందీ డబ్బింగ్ వెర్షన్ టీవీలో ప్రసారం కావడం, అలాగే యూట్యూబ్‌లో అందుబాటులో ఉండడం వల్ల మేం ఆశించిన స్థాయి ఫలితం దక్కలేదు. ఇదే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి’ అని తెలిపింది. కాగా.. జెర్సీ విడుదలైన మొదటి వారాంతంలో కేవలం ₹14 కోట్ల కలెక్షన్లని మాత్రమే రాబట్టింది. నివేదికల ప్రకారం.. ఈ చిత్రం ఇప్పటి వరకు కేవలం ₹17.20 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.

Updated Date - 2022-05-06T15:17:37+05:30 IST