Bigg Boss విన్నర్ హీరోగా.. డైమండ్ రత్నబాబు చిత్రం

ABN , First Publish Date - 2022-05-27T22:23:35+05:30 IST

బిగ్‌బాస్ (Bigg Boss) షో.. తెలుగులో 5 సీజన్లు ముగించుకుని 6వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఈ 5 సీజన్లలో దాదాపు 100 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. షో పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత వరస అవకాశాలతో బిజీబిజీగా మారతారని అంతా ఊహించారు కానీ..

Bigg Boss విన్నర్ హీరోగా.. డైమండ్ రత్నబాబు చిత్రం

బిగ్‌బాస్ (Bigg Boss) షో.. తెలుగులో 5 సీజన్లు ముగించుకుని 6వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఈ 5 సీజన్లలో దాదాపు 100 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. షో పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత వరస అవకాశాలతో బిజీబిజీగా మారతారని అంతా ఊహించారు కానీ.. కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం కలిసొచ్చింది. ఆ అదృష్టం పొందిన వారిలో సొహైల్ (Sohel) మొదటి స్థానంలో ఉంటే.. 5వ సీజన్ విన్నర్‌గా నిలిచిన సన్నీ (VJ Sunny) కూడా ఇప్పుడా లిస్ట్‌లోకి చేరారు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవకపోయినా.. హీరోగా సొహైల్ వరుస అవకాశాలను పొందుతున్నాడు. తాజా సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన సన్నీ కూడా ఆర్టిస్ట్‌గా బిజీ అవుతున్నారు. తాజాగా ఆయన హీరోగా డైమండ్ రత్నబాబు (Diamond Ratna Babu) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. త్వరలో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 


చిత్ర ప్రారంభం రోజే సన్నీ-డైమండ్ రత్నబాబు చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయనున్నారనేలా టాక్ నడుస్తుంది. ‘సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు.. బిగ్‌బాస్ షో ద్వారా యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీతో సినిమా చేస్తుండటంతో.. అప్పుడే ఈ ప్రాజెక్ట్‌‌పై ఇండస్ట్రీలో టాక్ నడుస్తుండటం విశేషం. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. కాగా, ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే రివీల్ చేయనున్నారని సమాచారం.

Updated Date - 2022-05-27T22:23:35+05:30 IST