ప్రతాప్ పోతన్, అరవింద్‌కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘గ్రే’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ద స్పై హూ లవ్డ్ మీ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ ‘దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ ‘ నాకు యాక్టింగ్ , బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను నటించిన ‘గ్రే’ సినిమా ట్రైలర్‌ను ఎలైట్ ప్రో బాస్కెట్ బాల్ లీగ్‌లో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్‌లో తప్పకుండా బాస్కెట్ బాల్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తాను’ అన్నారు. మధుబాబు షాడో నవల తరహాలో అద్భుతంగా ఉండే మంచి థ్రిల్లర్ మూవీ ఇదనీ నిర్మాత కిరణ్ కాళ్లకూరి చెప్పారు.