నాలో హాస్యగ్రంథుల్ని నువ్వే మేల్కొల్పాలి: హరీష్‌కు చిరు ఓపెన్‌ ఆఫర్‌

ABN , First Publish Date - 2022-04-28T02:18:17+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‪లో‪ తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా

నాలో హాస్యగ్రంథుల్ని నువ్వే మేల్కొల్పాలి: హరీష్‌కు చిరు ఓపెన్‌ ఆఫర్‌

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‪లో‪ తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‪గా విడుదల కాబోతోంది. దీంతో గత వారం రోజుల నుండి చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ‘గబ్బర్‪సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ ప్రత్యేకంగా ‘ఆచార్య’ టీమ్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ చిత్ర విషయాలతో పాటు.. దర్శకుడు హరీష్ శంకర్ కూడా చిరుతో ‘దొంగమొగుడు’, ‘రౌడీ అల్లుడు’ తరహాలో ఓ సినిమా చేయాలనే ఆసక్తిని కనబరిచారు. దీనికి చిరంజీవి కూడా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.


చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలంటూ దాదాపు 10 సంవత్సరాలు, మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 4 సంవత్సరాలు.. మొత్తంగా 14 సంవత్సరాల నుండి అంతా సీరియస్‪గా నడుస్తుంది. ఎవరైనా జోక్ వేసినా.. ఏమిటో నవ్వలేకపోతున్నాను.. నవ్వు రావడం లేదు. నాలో హాస్యగ్రంథులు చనిపోయాయేమో అనిపిస్తుంది. నాకు మళ్లీ అందరినీ నవ్వించేలా అంటే ‘దొంగమొగుడు’, ‘రౌడీ అల్లుడు’, ‘చంటబ్బాయ్’ వంటి సినిమా స్క్రిప్ట్‪తో నీతో సినిమా చేయాలని ఉంది. అటువంటి స్క్రిప్ట్‪తో  నాలో హాస్యగ్రంథుల్ని నువ్వే మేల్కొల్పాలి..’’ అని హరీష్ శంకర్‪ని చిరు కోరారు. దీనికి హరీష్ శంకర్ సంతోషంతో.. ప్రస్తుతం పవర్ స్టార్‪తో చేస్తున్న సినిమా పూర్తవగానే మెగాస్టార్ స్క్రిప్ట్‪ వర్క్ మీదే కూర్చుంటానని మాటిచ్చారు.

Updated Date - 2022-04-28T02:18:17+05:30 IST