ఆరు నెలల్లో ‘మా’ భవనానికి భూమి పూజ చేస్తాం!

ABN , First Publish Date - 2022-05-16T06:57:45+05:30 IST

‘‘మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) సభ్యుల సంక్షేమం, వారి ఆరోగ్యం నా ప్రధాన కర్తవ్యం. మరో ఆరు నెలల్లో..

ఆరు నెలల్లో ‘మా’ భవనానికి భూమి పూజ చేస్తాం!

‘‘మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) సభ్యుల సంక్షేమం, వారి ఆరోగ్యం నా ప్రధాన కర్తవ్యం. మరో ఆరు నెలల్లో ‘మా’ భవనానికి భూమి పూజ నిర్వహిస్తామ’’న్నారు మంచు విష్ణు. ఆదివారం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యుల కోసం హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ ‘‘మా సభ్యులకు ఏఐజీ ఆసుపత్రి వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని సభ్యులంతా సద్వినియోగం చేసుకోవాల’’న్నారు. ఏపీలో టికెట్‌ రేట్ల విషయంలో వివాదం రేగినప్పుడు విష్ణు స్పందించలేదు. దానిపై వివరణ ఇస్తూ.. ‘‘అప్పట్లో నేను మాట్లాడలేదని చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు టికెట్‌ రేట్లతోనే ఇబ్బంది అంటున్నారు. ప్రభుత్వం తరపునుంచి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి, టికెట్‌ రేట్ల పెంపు అవసరం ఉందా, లేదా? అనేది చర్చించుకొని ముందుకు వెళ్లాలి’’ అని సూచించారు.  

Updated Date - 2022-05-16T06:57:45+05:30 IST