Tollywood : ముగిసిన ‘మా’, గిల్డ్ సమావేశం

ABN , First Publish Date - 2022-08-03T22:54:06+05:30 IST

టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం షూటింగులు ఆపేశారు నిర్మాతలు. నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, పలు విభాగాలు వరుసగా సమావేశమవుతున్నాయి. ఒక్కో విభాగం ఒకో సమస్యపై చర్చిస్తున్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యపై చర్చించేందుకు దర్శకుడు తేజా (Teja) ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు.

Tollywood : ముగిసిన ‘మా’, గిల్డ్ సమావేశం

టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం షూటింగులు ఆపేశారు నిర్మాతలు. నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, పలు విభాగాలు వరుసగా సమావేశమవుతున్నాయి. ఒక్కో విభాగం ఒకో సమస్యపై చర్చిస్తున్నారు. ఎగ్జిబిటర్స్ సమస్యపై చర్చించేందుకు దర్శకుడు తేజా (Teja) ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. తాజాగా ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (Movie Artistes Association) (‘మా’) కూడా రంగంలోకి దిగింది. ఈ రోజు మధ్యాహ్నం ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులతో ‘మా’ భేటీ అయింది. అయితే మీటింగ్ ప్లేస్ ను  గిల్డ్ సభ్యులు అన్నపూర్ణ 7 ఎకర్స్ నుంచి దిల్ రాజు (Dil Raju) ఆఫీస్ కు మార్చారు.


‘మా’ నుంచి మంచు విష్ణు (Manchu Vishnu), జీవిత (Jeevitha), రాజశేఖర్ (Rajasekhar) ,రఘుబాబు, శివబాలాజీ తదితరుల హాజరవగా..  గిల్డ్ నుంచి  దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బాపినీడు, మైత్రి రవి వివేక్ కుచిబొట్ల తదితరులు హాజరయ్యారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్‌ల పై కీలక చర్చలు జరిగాయి. డైలీ పేమెంట్ ఆర్టిస్టులు, ఆర్టిస్టుల స్టాఫ్ ఖర్చులు  తదితర అంశాలపై కూడా చర్చించారు. కాస్ట్ కంట్రోల్ రెమ్యునరేషన్‌ల విషయం‌లో గిల్డ్ ప్రత్యక కమిటీ వేసింది. సినిమా షూటింగుల్లో వేస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవటం, ఇతర భాషా నటీనటుల మెంబర్ షిప్, ఆర్టిస్ట్ ల రెమ్యునిరేషన్‌ల పై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఇరు పక్షాలు మరోసారి సమావేశం కాబోతున్నారు. 

Updated Date - 2022-08-03T22:54:06+05:30 IST