సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఘనంగా బాలీవుడ్ హీరోయిన్ వివాహం

ABN , First Publish Date - 2022-01-27T20:29:20+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ ప్రియుడు సూరజ్ నంబియార్‌ను గురువారం పెళ్లాడింది. గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది.

సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఘనంగా బాలీవుడ్ హీరోయిన్ వివాహం

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ ప్రియుడు సూరజ్ నంబియార్‌ను గురువారం పెళ్లాడింది. గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లి సౌత్ ఇండియన్ స్టైల్‌లో జరిగినట్టు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలను మౌనీరాయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘‘ నా లవ్ చివరకు దొరికాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మా వివాహం ఘనంగా జరిగింది. మీ అందరి ఆశీర్వాచనాలు కావాలి ’’ అని ఆమె కామెంట్ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు అనేక మంది బాలీవుడ్ సెలెబ్రిటీస్ స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు అంటూ తమ స్పందనను తెలిపారు. సూరజ్ నంబియార్ దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా మౌనీరాయ్‌తో అతడు డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 


మౌనీరాయ్ హల్దీ, మెహందీ వేడుకలు జనవరి 26న జరిగాయి. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సంగీత్ వేడుకలు జనవరి 28న జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ వివాహానికి అర్జున్ బిజిలానీ, మందిరా బేడీ తదితర బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.  



Updated Date - 2022-01-27T20:29:20+05:30 IST