Mouni Roy: ఆ హీరోయిన్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది

ABN , First Publish Date - 2022-09-11T23:41:54+05:30 IST

‘నాగినీ’ సీరియల్‌తో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి మౌనిరాయ్ (Mouni Roy). ‘గోల్డ్’, ‘అమర్ అక్బర్ వాల్టర్’, ‘మేడ్ ఇన్ చైనా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra)

Mouni Roy: ఆ హీరోయిన్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది

‘నాగినీ’ సీరియల్‌తో ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి మౌనిరాయ్ (Mouni Roy). ‘గోల్డ్’, ‘అమర్ అక్బర్ వాల్టర్’, ‘మేడ్ ఇన్ చైనా’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) లో విలన్ పాత్రను పోషించి అందరిని మెస్మరైజ్ చేసింది. మౌనిరాయ్ తాజాగా మీడియాకు ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో.. తనను ఒక హీరోయిన్ ఎంతగానో ఆకట్టుకుందని తెలిపింది. ఓ సినిమాలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించింది.


గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi) సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని మౌనిరాయ్ తెలిపింది. ఈ చిత్రంలో ఆలియా భట్ (Alia Bhatt) నటనకు తాను ఫిదా అయ్యానని చెప్పింది. ‘‘ఈ మధ్య నేను చూసిన చిత్రాల్లో ‘గంగూబాయి కతియావాడి’ నాకు ఎంతో నచ్చింది. ఈ మూవీకి సంబంధించినంత వరకు ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఆలియా నటన నన్ను ఆకట్టుకుంది. ఆమె అద్భుతంగా నటించింది. ఇటువంటి చిత్రం చేయాలని నాకు ఉంది. నిజం చెప్పాలంటే అటువంటి ఆసక్తికరమైన స్క్రిఫ్ట్‌లు నా వద్దకు వస్తున్నాయి’’ అని మౌనిరాయ్ తెలిపింది. ఇక మౌని నటించిన ‘బ్రహ్మాస్త్ర’ విషయానికి వస్తే.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్స్‌గా నటించారు. ఫాంటసీ ఆడ్వెంచర్‌గా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 160కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. 

Updated Date - 2022-09-11T23:41:54+05:30 IST