రేప్ ఆరోపణలతో పోలీస్ కస్టడీలో మలయాళం దర్శకుడు

ABN , First Publish Date - 2022-03-06T22:03:14+05:30 IST

రేప్ ఆరోపణలతో ఓ మలయాళం డైరెక్టర్‌ను పోలీసులు తమ అదుపులోకి తీసకున్నారు

రేప్ ఆరోపణలతో పోలీస్ కస్టడీలో మలయాళం దర్శకుడు

రేప్ ఆరోపణలతో ఓ మలయాళం డైరెక్టర్‌ను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నివిన్ పాలీ హీరోగా తెరకెక్కుతోన్న ‘పడవెట్టు’ అనే సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్‌గా ఇదే అతడికి తొలి చిత్రం. ఈ క్రమంలో అతడికి వ్యతిరేకంగా చిత్ర బృందానికి చెందిన ఓ యువతి కక్కనాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను రేప్ చేశాడని ఆరోపించింది. దీంతో లిజు కృష్ణను పోలీసులు మార్చి6న తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్నూర్‌లో జరుగుతోంది. పోలీసులు డైరెక్టర్‌ను అరెస్టు చేయడంతో చిత్రీకరణను వాయిదా వేశారు.   


‘పడవెట్టు’  చిత్రానికి లిజు కృష్ణనే స్క్రిఫ్ట్‌ రాశాడు. ఈ చిత్రంలో మంజు వారియర్, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటుడైన సన్నీ వేన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. గతంలో ‘మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్’  నాటకానికి లిజు కృష్ణ, సన్నీ వేన్ కలసి పనిచేశారు.

Updated Date - 2022-03-06T22:03:14+05:30 IST