మొక్కిందోటి... దక్కిందోటి రంగో.. రంగా...!

Twitter IconWatsapp IconFacebook Icon

‘‘అనుకున్నదోటి.. అయ్యిందోటి రంగో రంగా.. మొక్కిందోటి.. దక్కిందోటి రంగో.. రంగా’’ అంటూ నాని తెగ ఫీలైపోతున్నారు. కాలం కచ్చి  కట్టి.. తన పిచ్చిని వదిల్చిందంటూ పాట పాడుకుంటున్నారు... ‘అంటే సుందరానికి..’ కోసం. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నజ్రియా ఫహద్‌ కథానాయిక. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం నుంచి ‘రంగో.. రంగా..’ అనే పాటని సోమవారం విడుదల చేశారు. సనాపతి భరద్వాజ పాత్రుడు రచించిన ఈ గీతాన్ని వివేక్‌ సాగర్‌ స్వర పరిచారు. కారుణ్య ఆలపించారు. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన రెండు పాటలకూ మంచి స్పందన వచ్చింది. ‘రంగో.. రంగా’ సరదాగా సాగిపోయే గీతం. కారుణ్య చాలా ఎనర్జిటిక్‌గా పాడారు. జూన్‌ 3న తెలుగుతో పాటుగా తమిళంలో ‘అదాడే సుందరా’, మలయాళంలో ‘ఆహా సుందరా’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. నదియా, హర్ష వర్థన్‌, రాహుల్‌ రామకృష్ణ, సుహాస్‌ తదితరులు నటించారు. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.