మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-30T19:28:42+05:30 IST

మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని సాధించి గతేడాది వార్తల్లో నిలిచిన బ్యూటీ హర్నాజ్ సంధు. దాదాపు 20 సంవత్సారాల తర్వాత ఈ భామ..

మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..

మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని సాధించి గతేడాది వార్తల్లో నిలిచిన బ్యూటీ హర్నాజ్ సంధు. దాదాపు 20 సంవత్సారాల తర్వాత ఈ భామ మన దేశానికి ఈ కిరిటాన్ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మాత్రం మాత్రం పాజిటివ్‌గా కాదు నెగిటివ్‌గా.


ముంబైలోని ఓ హోటల్‌లో లక్మే ష్యాషన్ వీక్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఎంతోమంది ప్రముఖులు ర్యాంప్ వాక్ చేసిన డిజైనర్స్ రూపొందించిన స్టైలిష్ దుస్తులను పదర్శించారు. తాజాగా మిస్ యూనివర్స్ హర్నాజ్ సైతం ఆ షోలో ర్యాంప్ వాక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరెంజ్ డ్రెస్‌లో ఎంతో అందంగా ఉన్న ఈ బ్యూటీ కొంచెం లావై బొద్దుగా కనిపించింది. అయితే ఈ భామ శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా ఇది నచ్చని కొందరు నెటిజన్లు ఈ భామపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు. మరోవైపు.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారతదేశానికి అందించిన యువతిని ఇలా బాడీ షేమింగ్ చేయడం కరెక్టు కాదంటూ మరికొందరు హర్నాజ్‌కి సపోర్టు చేస్తున్నారు. కాగా.. ఈమెకంటే ముందు 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తా ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు.



Updated Date - 2022-03-30T19:28:42+05:30 IST