Sini Shetty Miss India: బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్, టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టం

ABN , First Publish Date - 2022-07-22T23:29:59+05:30 IST

ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 58వ మిస్ ఇండియా పోటీల్లో కర్ణాటకు చెందిన సినీ శెట్టి (Sini Shetty) టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్ ఇండియా ఫైనల్ రౌండ్‌లో

Sini Shetty Miss India: బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్, టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టం

ముంబైలోని రిలయన్స్ జియో కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 58వ మిస్ ఇండియా పోటీల్లో కర్ణాటకు చెందిన సినీ శెట్టి (Sini Shetty) టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్ ఇండియా ఫైనల్ రౌండ్‌లో మొత్తం 31మంది అమ్మాయిలు పోటీపడగా ఈ ముద్దగుమ్మ కిరీటాన్ని గెలుచుకుంది. అందాల తారలు నేహా ధూపియా, మలైకా అరోరాతో పాటు మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్‌లతో కూడిన జ్యూరీ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. సినీ శెట్టి తాజాగా హైదరాబాద్‌కు విచ్చేసింది. ఈ సందర్భంగా ‘ABN-Andhrajyothi’ తో మాట్లాడింది. ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


ప్రస్తుతం తన ప్రయాణం అద్భుతంగా కొనసాగుతుందని మిస్ ఇండియా సినీ శెట్టి చెప్పింది. ‘‘టైటిల్ గెలిచాక నా మీద అంచనాలు పెరిగిపోయాయి. వాటిని అందుకోవడానికీ నేను ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్‌కు సిద్ధమవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నేను దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఓ ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే ఏడాది ఎవరైనా గెలుచుకోవచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేదు. ఎవరైనా టైటిల్‌ను గెలుచుకునే ఛాన్స్ ఉంది. మా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకడమిక్‌గా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాలను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నేను మిస్ ఇండియాకు వెళ్తానంటే నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ఎందుకంటే కాలేజీ స్థాయి వరకు నాకు మంచి మార్కులు వచ్చాయి. నాకు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) అంటే చాలా అభిమానం. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపించాలి’’ అని సినీ శెట్టి తెలిపింది. 

Updated Date - 2022-07-22T23:29:59+05:30 IST