తనకు ఏవిధంగా ఏడ్వాలో అర్థం కావడం లేదంటున్న Mimi Chakraborty..సహాయం చేయమంటూ నెటిజన్లను కోరిన బెంగాలీ నటి

ABN , First Publish Date - 2021-11-18T03:01:53+05:30 IST

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మిమి చక్రబర్తి. తాజాగా ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.

తనకు ఏవిధంగా ఏడ్వాలో అర్థం కావడం లేదంటున్న Mimi Chakraborty..సహాయం చేయమంటూ నెటిజన్లను కోరిన బెంగాలీ నటి

సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి మిమి చక్రబర్తి. తాజాగా ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్  పెట్టింది. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. తనకు ఏ విధంగా ఏడ్వాలో అర్థం కావడం లేదని ఆమె అంటుంది.  తన ఐ ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోలు, వీడియోలు డిలీట్ కావడమే ఆమె ఏడ్పునకు కారణం. దీంతో వాటిని తిరిగి పొందడానికి సహాయం చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లను ఆమె కోరింది. 


బెంగాలీ నటి, తృణ్ మూల్ ఎంపీ మిమి చక్రబర్తి. తన ఐ ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోలు, వీడియోలు డిలీట్ అయ్యాయని ట్విట్టర్‌లో తెలిపింది. ఆ ఫొటోలను తిరిగి పొందడంలో సహాయం చేయాలని  నెటిజన్లని ఆమె కోరింది. ఆ ఫొటోలు డిలీట్ కావడంతో చాలా బాధేసిందని వెల్లడించింది. దాదాపుగా 7వేల ఫొటోలు, 500వీడియోలు డిలీట్ అయ్యాయని పేర్కొంది. ఆపిల్ స్టోర్‌ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టింది. ‘‘నా ఐ ఫోన్ గ్యాలరీ నుంచి 7వేల ఫొటోలు, 500 వీడియోలు డిలీట్ అయ్యాయి. డిలీట్ అయిన వాటిని తిరిగి పొందడానికి  నేను అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ, వాటిని తిరిగి పొందలేకపోయాను ’’ అని ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ పెట్టింది. 


ఆమె ట్విట్టర్లో పెట్టిన పోస్ట్‌కు అనేక మంది  నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ‘‘ ఐ క్లౌడ్ లో అవి లభిస్తాయి ’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘డిజిటల్ ఉపకరణాలపై ఆధారపడటం మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి ’’ అని మరో నెటిజన్ తన స్పందనను తెలిపాడు. ప్రస్తుతం మిమి చక్రబర్తి పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్ పూర్ నుంచి తృణ్ మూల్ ఎంపీగా ఉంది.



Updated Date - 2021-11-18T03:01:53+05:30 IST