Viral Video: విమానంలో ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన టైసన్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-22T16:42:07+05:30 IST

మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: విమానంలో ప్రయాణికుడి ముఖం పగలగొట్టిన టైసన్.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. మైక్ టైసన్ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. అదే విమానంలో టైసన్ వెనక సీటులో కూర్చున్న ఓ యువకుడు పదేపదే అతడితో మాట్లాడుతూ ఇబ్బంది కలిగించాడు. పలుమార్లు ఆ యువకుడిని మాట్లాడింది చాలు.. నిశబ్దంగా కూర్చొమని సముదాయించాడు టైసన్. అయినా ఆ యువకుడు వినలేదు. వాటర్ బాటిల్ విసరడంతో పాటు ఇంకా ఎక్కువగా మాట్లాడటం చేశాడు. దాంతో చిర్రెతిపోయిన టైసన్.. ఒక్కసారిగా ఆ యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. యువకుడికి తన పంచ్ పవర్ చూపించాడు. అంతే.. యువకుడి ముఖం పగిలింది. ఈ ఘటనను కొందరు ప్రయాణికులు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనపై బ్లూ ఎయిర్‌లైన్ గానీ, యూఎస్ పోలీసులు గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.    



Updated Date - 2022-04-22T16:42:07+05:30 IST