బప్పిలహిరి.. మైకేల్ జాక్సన్.. ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య ఘటన.. ఆయన ఎవరో తెలియకపోయినా..

ABN , First Publish Date - 2022-02-17T00:19:11+05:30 IST

పాప్ సంగీతాన్ని ఇష్టపడేవారికి మైకేల్ జాక్సన్

బప్పిలహిరి.. మైకేల్ జాక్సన్.. ఎయిర్‌పోర్ట్‌లో అనూహ్య ఘటన.. ఆయన ఎవరో తెలియకపోయినా..

పాప్ సంగీతాన్ని ఇష్టపడేవారికి మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూన్‌వాక్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయన పేరే. ఆయన నుంచి వచ్చిన ఎన్నో ఆల్బమ్‌లు రికార్డులను తిరగరాశాయి. మైకేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ అల్బమ్‌ శ్రోతలను కూడా ఉర్రూతలూగించింది. బప్పిలహిరి, మైకేల్‌కు మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మొదటిసారి బప్పిదాని చూసినప్పుడు మైకేల్ జాక్సన్‌ ఆయనను గుర్తుపట్టలేదట. ఈ విషయాన్ని బప్పి‌నే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


‘‘పాప్ రారాజు మైకేల్ జాక్సన్ 1996లో భారతదేశానికి వచ్చారు. ఓ సారి ముంబైలోని ఎయిర్‌పోర్టులో నన్ను కలిశారు. నా మెడలో ఉన్న బంగారు ఆభరణాలను చూసి ఆశ్చర్యపోయారు. ‘మీరు ధరించిన ఆభరణాలు అద్భుతంగా ఉన్నాయి’ అని నన్ను పలకరించారు. అయితే, నేను సంగీత దర్శకుడిననే విషయం ఆయనకి తెలియదు. నా దగ్గరికి వచ్చి ‘మీ పేరేమిటి’ అని అడిగారు. ‘నా పేరు బప్పిలహిరి’ అని చెప్పాను. ‘మీరు సంగీత దర్శకుడు కదా. మీరు మ్యూజిక్ అందించిన ‘డిస్కో డ్యాన్సర్’‌లోని ‘జిమ్మి జిమ్మి’ పాట నాకెంతో నచ్చింది’ అని మైకేల్ చెప్పారు. ఆ మాటలను ఇప్పటికి నా మ‌దిలోనే ఉన్నాయి’’ అని బప్పిలహిరి స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-17T00:19:11+05:30 IST