రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ దర్శకత్వంలో ‘On Air’
ABN , First Publish Date - 2022-05-06T02:29:23+05:30 IST
హీరో, దర్శకుడిగా కన్నడలో ‘బీర్బల్ ట్రయాలజీ (Birbal Trilogy), ఓల్డ్ మంక్ (Old Monk)’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఎం జి శ్రీనివాస్ (శ్రీని) (MG Srinivas -Srini) మరో
హీరో, దర్శకుడిగా కన్నడలో ‘బీర్బల్ ట్రయాలజీ (Birbal Trilogy), ఓల్డ్ మంక్ (Old Monk)’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి సంచలనం సృష్టించిన ఎం జి శ్రీనివాస్ (శ్రీని) (MG Srinivas -Srini) మరో విభిన్న థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఆన్ ఎయిర్’ (On Air) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్జేగా కనిపించనున్నారు. ఆయన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయం ఖాయమని అటు శ్రీనితో పాటు చిత్రయూనిట్ కూడా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.
కాగా, చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూలైలో ప్రముఖ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’ (Bahubali), ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR) వంటి పలు భారీ చిత్రాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అసోసియేట్ ప్రశాంత్ సాగర్ (Prasanth Sagar).. ఈ ‘ఆన్ ఎయిర్’కు దర్శకత్వం వహించారు. వాయిపుత్ర ఎంటర్టైన్మెంట్స్, యస్ ఒరిజినల్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి రఘువీర్ గోరిపర్తి (Raghuveer GoriParthi), సృజన్ యరబోలు (Srujan Yarabolu) నిర్మాతలు.