Sita Ramam: క్లాస్ నంబర్‌గా మెస్మరైజ్ చేస్తోన్న థర్డ్ సింగిల్

ABN , First Publish Date - 2022-07-19T02:36:01+05:30 IST

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ (Kaanunna Kalyanam) పాట లిరికల్ వీడియోని సోమవారం చిత్రయూనిట్..

Sita Ramam: క్లాస్ నంబర్‌గా మెస్మరైజ్ చేస్తోన్న థర్డ్ సింగిల్

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించిన ‘సీతారామం’ (Sita Ramam) చిత్రం నుండి థర్డ్ సింగిల్ ‘కానున్న కళ్యాణం’ (Kaanunna Kalyanam) పాట లిరికల్ వీడియోని సోమవారం చిత్రయూనిట్ విడుదల చేసింది. క్లాస్ నంబర్‌గా వచ్చిన ఈ పాట.. సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తోంది. ఆసక్తికరమైన ప్రొమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే భారీ క్రేజ్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన పాట కూడా విన్న వింటనే ఆకట్టుకుంది. ఈ పాటని విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) స్వరపరచగా.. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఆలపించారు. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry) ఈ పాటకు అందించిన సాహిత్యం పదికాలాలు గుర్తుపెట్టుకునేలా వుంది.


‘‘కానున్న కళ్యాణం ఏమన్నది?

స్వయంవరం మనోహరం

రానున్న వైభోగం ఎటువంటిది?

ప్రతి క్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా

ముగింపు లేని గాధగా

తరముల పాటుగా తరగని పాటగా

ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ’’ అంటూ సాగిన ఈ పాట సాహిత్యం మనసుకి హాయిని కలిగిస్తోంది. అద్భుతమైన లోకేషన్స్ చిత్రీకరించిన ఈ పాట చాలా ఆహ్లాదకరంగా వుంది. ముఖ్యంగా దుల్కర్, మృణాల్ జంట మ్యాజికల్‌గా కనిపిస్తుంది. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో.. స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై అశ్విని దత్ (Ashwini Dutt) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna), సుమంత్ (Sumanth) కీలక పాత్రలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న  ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.



Updated Date - 2022-07-19T02:36:01+05:30 IST