మెరిసేలే మెరిసేలే...

ABN , First Publish Date - 2022-05-25T05:48:35+05:30 IST

హన్సిక కథానాయికగా, ఆర్గాన్‌ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. విడుదలకు సిద్ధమైంది...

మెరిసేలే మెరిసేలే...

హన్సిక కథానాయికగా, ఆర్గాన్‌ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. విడుదలకు సిద్ధమైంది. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించారు. ఈ చిత్రం నుంచి ‘మెరిసేలే మెరిసేలే’ అనే వీడియో లిరికల్‌ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ పాటను సత్య యామిని ఆలపించారు. మార్క్‌ రాబిన్‌ స్వరాలు అందించారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచారని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.  


Updated Date - 2022-05-25T05:48:35+05:30 IST