నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు గుర్తుకు వచ్చాయి

ABN , First Publish Date - 2022-06-28T05:33:42+05:30 IST

‘అన్న ఎన్టీఆర్‌ నిర్మించిన థియేటర్‌లో నేను దర్శకత్వం వహించిన ‘వేటగాడు’ చిత్రాన్ని మళ్లీ చూడడం చాలా ఆనందంగా ఉంది...

నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు గుర్తుకు వచ్చాయి

‘అన్న ఎన్టీఆర్‌ నిర్మించిన థియేటర్‌లో నేను దర్శకత్వం వహించిన ‘వేటగాడు’ చిత్రాన్ని  మళ్లీ చూడడం చాలా ఆనందంగా ఉంది. నాలుగు దశాబ్దాల నాటి స్మృతులు, అన్నగారితో గడిపిన మధుర క్షణాలు గుర్తుకు వచ్చాయి’ అన్నారు రాఘవేంద్రరావు. ఎన్టీఆర్‌ చలన చిత్ర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్‌ నటించిన చిత్రాలను రోజూ ఉచితంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సోమవారం ‘వేటగాడు’ చిత్రాన్ని రాఘవేంద్రరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా తిలకించారు. తన బొమ్మలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల ముందు రాఘవేంద్రరావు నిలబడి ఫొటోలు దిగడం విశేషం.


Updated Date - 2022-06-28T05:33:42+05:30 IST