‘న్యూ’ మెగా లుక్‌!

ABN , First Publish Date - 2022-08-13T06:31:48+05:30 IST

కథానాయకులు ఫొటో షూట్లపై పెద్దగా దృష్టి పెట్టరు. చిరంజీవి కూడా అంతే. ఆయన ఫొటో షూట్లు జరుపుకోవడం చాలా అరుదు.

‘న్యూ’ మెగా లుక్‌!

కథానాయకులు ఫొటో షూట్లపై పెద్దగా దృష్టి పెట్టరు. చిరంజీవి కూడా అంతే. ఆయన ఫొటో షూట్లు జరుపుకోవడం చాలా అరుదు. అయితే ప్రతి పుట్టిన రోజుకి ముందు స్పెషల్‌ గా ఓ ఫొటో షూట్‌ చేస్తారు. అభిమానుల కోసం. ఆగస్టు 22న చిరు బర్త్‌డే. ఈ సందర్భంగా ఇప్పుడు ఆయన ఓ ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రకరకాల ఫోజుల్లో చిరు దర్శనమిచ్చారు. వాటిలో స్టైలీష్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చిరు ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాలకు సంబంధించిన టీజర్లు, ఫస్ట్‌లుక్‌లు చిరు బర్త్‌డే సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు.. చిరు త్వరలోనే మరికొన్ని కొత్త సినిమాల్ని పట్టాలెక్కించనున్నారు. వాటికి సంబంధించిన అప్‌ డేట్స్‌ కూడా చిరు పుట్టిన రోజు పురస్కరించుకొని ప్రకటిస్తారని టాక్‌. 

Updated Date - 2022-08-13T06:31:48+05:30 IST