Chiranjeevi: చిరంజీవిలో చంటబ్బాయి బయటకి వచ్చాడు

ABN , First Publish Date - 2022-10-03T17:17:48+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi) తన అద్భుత ప్రసంగం తో అందరినీ అలరించటమే కాకుండా, నవ్వులు పండించాడు. చాలామంది అయితే చిరంజీవి లోని 'చంటబ్బాయి' (Chantabbai) బయటకి వచ్చాడు అన్నారు.

Chiranjeevi: చిరంజీవిలో చంటబ్బాయి బయటకి వచ్చాడు

మొన్న అల్లు రామలింగయ్య అవార్డు (Allu Ramalingiah National Award) ఫంక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఒక భావేద్వేగమయిన (Emotional speech) ప్రసంగం చేసాక, ప్రేక్షకులను మళ్ళీ మామూలు  తేవడానికి చిరంజీవి (Mega Star Chiranjeevi) తన అద్భుత ప్రసంగం తో అందరినీ అలరించటమే కాకుండా, నవ్వులు పండించాడు. చాలామంది అయితే చిరంజీవి లోని 'చంటబ్బాయి' (Chantabbai) బయటకి వచ్చాడు అన్నారు. ఇది కదా చిరంజీవి నుండి అందరూ ఆశిస్తున్నది అని అనుకున్నారు.


తనకి తన మామ అయిన అల్లు రామలింగయ్యకి ఎలా పరిచయం, తనకి తెలియకుండానే తనని ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి అల్లు రామలింగయ్య ఎలా స్కెచ్ వేసింది అన్న విషయం చిరంజీవి తన హాస్య రసమయిన (Chiranjeevi's hilarious speech) ప్రసంగంతో అందరినీ నవ్వులతో ముంచెత్తాడు. ప్రసంగం అయ్యాక వేదిక దిగి కిందకి వచ్చాక, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తాడు. అద్భుతంగా మాట్లాడారు సాయిర్, మీ స్పీచ్ అల్టిమాట్, అదిరింది అని అందరు పొగడలతో ముంచెత్తు తుంటే, ఇంతకీ కాఫీ లో ఏమి కలిపారు అని సురేఖ గారిని ఇంకో క్క సరదాగా అడిగారు అక్కడ అతిధులు. అసలు చిరంజీవి లో ఇంత హాస్యోక్తి వుందా అనిపించేట్టు తన వివాహం, పెళ్లిచూపులు, వివాహం అయ్యాక మామ అల్లు తో సరదాగా గడిపిన క్షణాలు చిరంజీవి ఎంత చక్కగా చెప్పాడు అంటే, అసలు ఇలాంటి డైలాగ్స్ సినిమాలో పెడితే, సూపర్ కదా అని అనుకున్నారు. చిరంజీవి ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేసి ఎన్నాళ్ళు అవుతోందో కదా, ఒక సినిమా చేస్తే అతని అభిమానులు మళ్ళీ పాత చిరంజీవిని చూస్తారు అని అనుకుంటున్నారు. చిరంజీవి ఇప్పుడు కొంచెం మెసేజ్ వున్న సినిమాలు, లేదా రీమక్స్ చేస్తున్నారు. మొన్నటి ప్రసంగం చూసాక, ప్రేక్షకులు ఒక మంచి హాస్య భరితమయిన చిత్రాన్ని చిరంజీవి ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.

సురేష్ కవిరాయని 

Updated Date - 2022-10-03T17:17:48+05:30 IST