God Father ట్విట్టర్ రివ్యూ: నెటిజన్ల రేటింగ్ ఎంతో తెలుసా?

Twitter IconWatsapp IconFacebook Icon
God Father ట్విట్టర్ రివ్యూ: నెటిజన్ల రేటింగ్ ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ (Lucifer) రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). దసరా పండుగను పురస్కరించుకుని నేడు (బుధవారం)  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ చూసిన వారంతా.. సినిమాపై పాజిటివ్ కామెంట్స్ చేయడమే కాకుండా.. సినిమాకు వారి రేటింగ్ ఎంతో కూడా చెబుతున్నారు. ఓవరాల్‌గా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అనేలా టాక్ నడుస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర చేసిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో కూడా ‘గాడ్‌ఫాదర్’ సందడి నెలకొంది. అక్కడ కూడా మంచి రివ్యూసే వినబడుతున్నాయి. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించి ట్విట్టర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం.


‘గాడ్‌ఫాదర్’ సినిమా చూడటం జరిగింది. స్టార్స్ హీరోలిద్దరూ చాలా బాగా చేశారు. సల్మాన్‌ ఖాన్ కనిపించేది కాసేపే అయినా.. చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు మా రేటింగ్ 4.5 అని, మరికొందరు 5 అని ఈ వీడియోలో చెబుతున్నారు.


‘‘ఫస్టాఫ్ అదిరిపోయింది. బాస్ చిరంజీవి అన్నయ్య అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సత్యదేవ్‌కి కెరీర్ బెస్ట్ పాత్ర ఇది. ఇక థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అవుట్‌స్టాండిండ్ బీజీఎమ్. మోహన్ రాజా హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరు అరాచకం అంతే.. గాడ్‌ఫాదర్’’ అంటూ స్టార్స్, ఫైర్ ఎమోజీలతో ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

‘‘అస్సలు ఊహించలేదురా అయ్యా.. సాంగ్స్ మాత్రం కేక, గన్ ఫైట్స్ అరుపులే.. బీజీఎమ్ చెవులు బద్దలైపోతున్నాయ్. క్లైమాక్స్‌లో సల్మాన్ ఖాన్, చిరంజీవి నడుచుకుంటూ వస్తారు.. అది కేక.. రాంప్ అంతే..’’ అని ఓ నెటిజన్ ఈ సినిమాపై ట్వీట్ చేశారు. 

ఓవరాల్‌గా.. సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాకే నడుస్తుంది. సినిమా చూసిన, చూస్తున్న ఆడియన్స్.. సినిమాపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. యునానిమస్‌గా హిట్ టాక్ వినబడుతుండటంతో.. సోషల్ మీడియాలో మెగాభిమానుల ఆనందానికి అవధులే లేవంటే నమ్మాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘గాడ్‌ఫాదర్’‌ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో..




AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.