Varun Tej: కొణిదెల కుర్రాడు.. ఏమున్నాడ్రా?

ABN , First Publish Date - 2022-09-17T16:24:30+05:30 IST

కెరీర్ మొదలైనప్పటి నుండి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ (Varun Tej). వెనుక మహావృక్షం వంటి మెగాస్టార్ చిరంజీవి..

Varun Tej: కొణిదెల కుర్రాడు.. ఏమున్నాడ్రా?

కెరీర్ మొదలైనప్పటి నుండి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్ (Varun Tej). వెనుక మహావృక్షం వంటి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సపోర్ట్ ఉన్నా.. తనంతట తనుగా వరుణ్ ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయనని మెగాభిమానులు మెగా ప్రిన్స్ (Mega Prince) అని పిలుచుకుంటూ ఉంటారు. వరుణ్ హైట్, కటౌట్ ఆ బిరుదుకు పర్ఫెక్ట్ అనేలా ఉంటాయి. అయితే కొంతకాలంగా ఈ కొణిదెల కుర్రాడికి సరైన హిట్ మాత్రం పడటం లేదు. సినిమాలైతే చేస్తున్నాడు.. అందులో తను ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాడు.. కానీ హిట్ మాత్రం ఆయనకి ఈ మధ్య కాలంలో కష్టమవుతోంది. అందుకు కారణాలు అనేకం. రీసెంట్‌గా వచ్చిన ‘F3’ కూడా వరుణ్‌కు సరిపడా సక్సెస్‌ని ఇవ్వలేకపోయింది. అందుకే, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వరుణ్ తేజ్ ఉన్నట్లుగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ చూస్తుంటే తెలుస్తోంది. 


ఈ పిక్‌లో వరుణ్ తేజ్‌‌ని చూసిన నెటిజన్లు.. ‘అబ్బ.. ఏమున్నాడ్రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే.. ఆయన మేకోవర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లుక్ తన తదుపరి సినిమా కోసమో.. లేదంటే ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసమో తెలియదు కానీ.. రగ్డ్ అండ్ మాసివ్ లుక్‌లో వరుణ్ తేజ్ కత్తిలా ఉన్నాడనేలా అనిపించుకుంటున్నాడు. నిజంగా ఈ మేకోవర్‌తో ఆయన సినిమా చేస్తుంటే మాత్రం.. ముందు నుండే సినిమాపై భారీగా అంచనాలు పెరగడం ఖాయం. ప్రస్తుతం ఆయన ‘VT12’ చిత్రం ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ‘VT13’ చిత్రం సెప్టెంబర్ 19న ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఈ రగ్డ్, మాసివ్ ఫొటోషూట్స్ ఫిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. 



Updated Date - 2022-09-17T16:24:30+05:30 IST