Lokesh Kanagrajకు మెగా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..?

ABN , First Publish Date - 2022-06-08T17:13:10+05:30 IST

ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య (Acharya) సినిమాల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

Lokesh Kanagrajకు మెగా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్..?

ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య (Acharya) సినిమాల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని చేస్తున్న సంగతి  తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), శిరీష్‌ (Sirish)తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. అంజలి, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


అయితే, ఈ సినిమా తర్వాత చరణ్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ లైనప్ రెడీగా ఉంది. ఇప్పటికే, 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్న ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. అలాగే, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇదే వరుసలో ప్రశాంత్ నీల్‌తో పాటు మరికొందరు దర్శకులు కథలు సిద్ధం చేసుకొని చరణ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు.


అయితే, ఈ లైనప్‌లో కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగ్ రాజ్ (Lokesh Kanagaraj) కూడా చేరాడని తెలిసిందే. ఇంతకముందే చరణ్ - లోకేష్ కలిసి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన కథ రెడీ అవుతుందట. ఆర్సీ 15 (RC 15) కంప్లీట్ అయ్యేలోపు చరణ్‌కు కథ చెప్పడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట లోకేష్. ఇటీవల వచ్చిన 'విక్రమ్' (Vikram) సినిమాతో కమల్ హాసన్‌ (Kamal Haasan)కు భారీ హిట్ ఇచ్చాడు. నెక్స్ట్ సినిమాను 'తలపతి' విజయ్‌తో చేయబోతున్నాడు. ఆ తర్వాత చరణ్‌తో ప్రాజెక్ట్ ఉంటుందని తాజాగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలో వీరి కాంబినేషన్‌లో సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా రానుందట. 

Updated Date - 2022-06-08T17:13:10+05:30 IST