Pawan Kalyan Fans: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. ఫ్యాన్స్ కూడా తగ్గట్లే!

ABN , First Publish Date - 2022-08-31T00:15:24+05:30 IST

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పవన్ కళ్యాణ్‌ని ఏదో చేయాలని ఆ సినిమా విడుదలకు

Pawan Kalyan Fans: ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. ఫ్యాన్స్ కూడా తగ్గట్లే!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పవన్ కళ్యాణ్‌ని ఏదో చేయాలని ఆ సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లు తగ్గించింది. ఇలాంటి అడ్డంకులు కల్పిస్తున్న ఆ ప్రభుత్వానికి అప్పట్లో పవన్ కళ్యాణ్ తన సినిమాని అందరికి ఫ్రీ గా చూపిస్తా అన్నారు, తరువాత ఆ సినిమా విడుదలై.. బాగానే ఆడింది. విచిత్రం ఏమిటంటే.. ‘భీమ్లానాయక్’ తర్వాత అదే ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు సంబంధించి సినిమా టికెట్స్ వాళ్ళకి కావలసినట్టుగా మొదటి వారం పెంచుకోవచ్చని చెప్పింది. పవన్ కళ్యాణ్‌ని ఏదో చేద్దామని వారు ప్రయత్నించినా.. ఏమీ చేయలేకపోయారు.


ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పవన్ హిట్ సినిమా ‘జల్సా’ని 4K (Jalsa 4K) క్వాలిటీతో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలోనూ థియేటర్స్ అన్నీ బుక్ చేశారు.. కానీ ఆంధ్రాలో మళ్ళీ జగన్ ప్రభుత్వం దీనికి కూడా అడ్డంకులు పెట్టాలన్నట్లుగా.. అర్జెంటు‌గా ప్లాస్టిక్ హోర్డింగ్స్‌ని నిషేధించింది. ‘‘మా నాయకుడు పవన్ కళ్యాణ్‌గారు చేస్తున్న సేవకి ప్రజల్లో మంచి పేరు వుంది, ప్రజలు ప్రతి చోటా ఎంతో ఆదరిస్తున్నారు. మా నాయకుడికి పేరు రావాలంటే హోర్డింగ్స్ అవసరం లేదు. ఆ హోర్డింగ్స్‌కి అయ్యే ఖర్చు మేము జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చేస్తాము, లేదా ఇంకో సేవ కోసం ఉపయోగిస్తాం, ఇలాంటి అడ్డంకులు ఎన్ని పెట్టినా.. మేము భయపడం.. మాదీ కూడా మా నాయకుడి మాటే.. మనల్ని ఎవడ్రా ఆపేది..’’ అని అంటున్నారు ప్రదీప్ రెడ్డి (Pradeep Reddy) (కూకట్‌పల్లి పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్).


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘అదొక్కటే కాదు, కాకినాడలో మా హీరో సినిమా ‘జల్సా’ షోని అడ్డుకునేందుకు. అక్కడ ఎగ్జిబిటర్స్‌తో బెనిఫిట్ షో వేయడానికి కుదరదని డిస్ట్రిబ్యూటర్స్‌కి ఒక లెటర్ ఇప్పించారు. దీని వెనుక జగన్ ప్రభుత్వం వుందని మాకు తెలుసు. వాళ్ళు ఎన్ని అనుకున్నా కానీ మేము భయపడము.. మా పని మేము చేసుకుంటూ వెళతాం. మా నాయకుడికి ఇలాంటివి ఎన్ని చేసినా క్రేజ్ తగ్గదు.. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వారాల క్రితం ‘పోకిరి’ (Pokiri) స్పెషల్ షోలకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు ‘జల్సా’కి ఎందుకు 'నో' అంటోంది. మా నాయకుడికి వున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకపోతోందీ జగన్ ప్రభుత్వం..’’ అని అంటున్నారు ప్రదీప్.


ప్రదీప్ ఇంకో విషయం కూడా స్పష్టం చేశారు.. ‘‘ఓటు కోసం మేము ఒక్క నయాపైసా కూడా ఖర్చుపెట్టం. పవన్ కళ్యాణ్‌గారి నాయకత్వంలో జనసేన (Janasena) పార్టీ నుండి మేము ప్రజలకి మంచి చేయడానికే పూనుకున్నాం. గెలిచినా, గెలవకపోయినా.. మా సేవ మేము కంటిన్యూ చేస్తాము. అంతే కానీ, ఈ షోస్, ఈ హంగామా.. మేము ఓట్ల కోసమో.. లేదంటే మా హీరో గొప్పతనాన్ని ప్రూవ్ చేయడానికో కాదు. ఈ షోస్ వల్ల వచ్చిన డబ్బులు కూడా సామాజిక సేవకే వినియోగిస్తాం’’ అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ‘జల్సా 4K’ స్పెషల్ షో‌స్ గురించి చెబుతూ.. ఒక్క హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-బుకింగ్స్‌తోనే మహేష్ బాబు సినిమా ‘పోకిరి’ స్పెషల్ షోస్ రికార్డ్స్‌ని ‘జల్సా’ అధిగమించిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-08-31T00:15:24+05:30 IST