GodFather ప్రమోషన్స్‌లోకి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎందుకొచ్చాడు?

Twitter IconWatsapp IconFacebook Icon
GodFather ప్రమోషన్స్‌లోకి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎందుకొచ్చాడు?

మెగా, నందమూరి హీరోలు (Mega and Nandamuri Fans) కలిసి సినిమాలు చేసినా, స్నేహంగా మెలుగుతున్నా.. వారి అభిమానులు మాత్రం దానిని పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నారు. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్పంటూ.. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వారి మధ్య యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాని చూస్తే తెలిసిపోతుంది. దీనిపై ఆయా హీరోలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సరే, ఆ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chrianjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) పేరు ఎక్కువగా హైలెట్ అవడంతో.. అసలు మెగా హీరో సినిమా ప్రమోషన్స్‌లోకి నందమూరి హీరో (Nandamuri Hero) ఎందుకు వచ్చాడంటూ మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.


ఒక హీరో సినిమా వేడుక జరుగుతుంటే.. అందులో ఇంకొక హీరో పేరు ప్రస్తావన వస్తేనే అభిమానులు అవమానంగా ఫీలవుతుంటారు. అలాంటిది.. ఒక మినీ యుద్ధమే నడుస్తున్న హీరోల పేర్లు.. ఇలా సడెన్‌గా ఇంటర్వ్యూలలో వస్తే అసలు తట్టుకోగలరా? ఇప్పుడు మెగాభిమానుల (Mega Fans) పరిస్థితి అదే. విషయంలోకి వస్తే.. ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించి జరుగుతున్న ప్రమోషన్స్‌ (Godfather Movie Promotions)లో భాగంగా.. అందులో కీలకమైన పాత్రలో నటించిన సత్యదేవ్ (Satya Dev) మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా గురించి, మెగాస్టార్ (Mega Star) గురించి అంతా బాగానే మాట్లాడిన సత్యదేవ్.. చివరిలో అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)ల చిత్రాలలో చేయాలని ఉందని, ముఖ్యంగా యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ అంటే తనకూ ఇష్టమేనని, ఆయన సినిమాలో నటించేందుకు వేచి చూస్తున్నానని.. చెప్పినట్లుగా ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. దీంతో మెగా హీరో (Mega Hero) సినిమా ప్రమోషన్స్‌లోకి నందమూరి హీరో ఎందుకొచ్చాడంటూ? మెగా అభిమానులు (Fans) ఫైర్ అవుతున్నారు. అయితే మీడియానే.. సత్యదేవ్‌ని ఆ ప్రశ్న అడిగినట్లుగా తెలుస్తోంది. మీడియా అడిగిన ప్రశ్నకే సమాధానమిస్తూ.. సత్యదేవ్ పై విధంగా సమాధానమిచ్చాడని అనుకుంటున్నారు.

GodFather ప్రమోషన్స్‌లోకి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎందుకొచ్చాడు?


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.