GodFather: వ్యూహమో..? కన్ఫ్యూజనో? ఆడేసుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-09-16T17:11:25+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). మలయాళ చిత్రం ‘లూసిఫర్’..

GodFather: వ్యూహమో..? కన్ఫ్యూజనో? ఆడేసుకుంటున్నారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (GodFather). మలయాళ చిత్రం ‘లూసిఫర్’ (Lucifer)కి రీమేక్ చిత్రమిది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని విజయ దశమి కానుకగా ‘అక్టోబర్ 5’ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే చిత్ర ప్రమోషన్స్ విషయంలో మాత్రం అభిమానులతో మేకర్స్ ఆడేసుకుంటున్నారు. ఈ సినిమాని సూపర్ గుడ్ ఫిలింస్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా రామ్ చరణే నిర్మిస్తున్నా కూడా.. ప్రమోషన్స్ విషయంలో టీమ్ కన్ఫ్యూజ్ అవుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలది కన్ఫ్యూజనో.. లేక టీమ్ వ్యూహమో తెలియక అభిమానులు అసహనానికి గురవుతున్నారు. 


తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ థార్ మార్ థక్కర్ మార్ (ThaarMaarThakkarMaar)ని మేకర్స్ విడుదల చేశారు. అంతకుముందు సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో విడుదల విషయంలో అభిమానులను నిరాశకు, కన్ఫ్యూజన్‌కు గురిచేసిన టీమ్.. లిరికల్ సాంగ్ విడుదల చేసే విషయంలో కూడా దానిని కంటిన్యూ చేసి చిరాకు తెప్పించారు. పోనీ చివరికి ఆ లిరికల్ సాంగ్‌ని ఏమైనా యూట్యూబ్ ద్వారా విడుదల చేశారా? అంటే అదీ లేదు. స్పాటిఫై అంటూ కొత్త కలరింగ్ ఇచ్చారు. ఇది అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. అందులో విడుదల చేయడానికి.. ఇంకాసేపట్లో.. అంటూ ఊరించడం ఏమిటో వారికే తెలియాలి. ఫైనల్‌గా.. యూట్యూబ్‌లో విడుదల చేయడానికి సాంకేతిక సమస్య సంభవించింది.. ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలోనే ప్రకటిస్తామనే మెసేజ్‌ చూశాక.. అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో వారు కామెంట్స్‌తో కదం తొక్కారు. ఎందుకంటే సాంగ్ ప్రోమో విషయంలో.. పోనీలే అని సర్దుకుపోయారు.. జరిగిన తప్పుని సరిచేసుకోకుండా.. మళ్లీ అదే రిపీట్ చేస్తే.. మెగాభిమానులనే కాదు.. ఎవరికైనా కోపం వస్తుంది. సరే.. ఫైనల్‌గా సాంగ్ రిలీజ్ చేశారా.. అంటే అదీ లేదు. ఆడియో ఫ్లాట్‌ఫామ్‌లో వదిలారు.. దానిని క్లిక్ చేస్తే సబ్‌స్ర్కైబ్ అవ్వండి అనే మెసేజ్. అంతే, ఇక కామెంట్ల మోత మోగింది. 


వ్యూహం పరంగా చెప్పాలంటే.. ‘ఆచార్య’ (Acharya) సినిమా రిజల్ట్‌తో చిరు సినిమాలకున్న క్రేజ్ దారుణంగా పడిపోయింది. ఇప్పుడు ‘గాడ్‌ఫాదర్’ విషయంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రేక్షకులు ఈ సినిమాపై ఎలాంటి ఇంట్రస్ట్‌తో ఉన్నారనేది తెలుసుకోవడానికి.. ప్రోమో విడుదల విషయంలో టైమ్‌ను పొడిగిస్తూ.. ట్రెండ్ అవ్వాలని టీమ్ అలా చేసినట్లుగా టాక్ నడిచింది. అదే వ్యూహాన్ని సాంగ్ విడుదల విషయంలో కూడా ట్రై చేశారు. దీంతో ఉన్న క్రేజ్ కాస్తా పోయింది. అలాగే, రేపు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో.. అని విడుదలకు ముందే సొమ్ము చేసుకునే దారులపై కూడా టీమ్ కన్నేసిందని, అందుకు నిదర్శనమే ఈ స్పాటిఫై అనేలా  కూడా టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా.. అభిమానులతో టీమ్ ఆడుకున్నది మాత్రం వాస్తవం. దీనిని సరిచేసుకోకపోతే.. సినిమా విడుదల నాటికి మెగాభిమానులే తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇకనైనా చిరు, చరణ్‌లు కాస్త అభిమానులను దృష్టిలో పెట్టుకుని.. మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటారేమో చూద్దాం. (Godfather lyrical song)



Updated Date - 2022-09-16T17:11:25+05:30 IST