Man of Masses: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎవరు? ఎన్టీఆరా? చరణా?

ABN , First Publish Date - 2022-09-15T04:01:46+05:30 IST

యంగ్ టైగర్ (Young Tiger), మెగా పవర్ స్టార్ (Mega Power Star).. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో..

Man of Masses: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎవరు? ఎన్టీఆరా? చరణా?

యంగ్ టైగర్ (Young Tiger), మెగా పవర్ స్టార్ (Mega Power Star).. ఇవి సరిపోవడం లేదు మెగా, నందమూరి అభిమానులకి. ఈ ఇరు హీరోల అభిమానులు ఇప్పుడో ట్యాగ్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు. ‘మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మా వాడు మ్యాన్ ఆఫ్ మాసెస్’ అంటూ ఇరు హీరోల అభిమానులు ఒకటే ట్వీట్లు. దీంతో ఆ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ కోసం ఒకరిని ఒకరు దూషించుకుంటూ, బూతులతో సోషల్ మీడియాని వేడెక్కిస్తున్నారు. ఆ బూతులు ఎలా ఉన్నాయంటే.. ఇతర హీరోల అభిమానులు నవ్వుకునేలా ఉన్నాయి. అసలు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ (Man of Masses) అనేది ఒక బిరుదేనా? ఎందుకు దాని కోసం ఇలా హీరోల అభిమానులు కొట్లాడుకుంటున్నారు.


చరణ్ (Charan), ఎన్టీఆర్‌(NTR)ల విషయం ఇలా ఉంటే.. మరో వైపు ‘బాస్ ఆఫ్ మాసెస్’ (Boss Of Masses) అని చిరంజీవి, ‘గాడ్ ఆఫ్ మాసెస్’ (God Of Masses) అని బాలయ్య.. ఇలా మాస్ ట్యాగ్‌‌ కోసం పోటీ పడుతున్నారు. వీరి విషయంలో అంతా బాగానే ఉంది.. కానీ ఈ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ గొడవే ఎటూ తేలేలా కనబడటం లేదు. సినిమాను బట్టి, సినిమాలోని క్యారెక్టర్‌ని బట్టి.. ఈ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ట్యాగ్‌ని ప్రతి ఒక్కరూ వేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్యాగ్‌కి మొదటి నుండి అర్హుడుగా చెప్పుకుంటూ వస్తుంది మాస్ రాజా రవితేజ (Ravi Teja). ఆయన సినిమాలలో మాసిజం ఎక్కువగా ఉండటంతో.. ఆయనని మాస్ మహారాజాగా పిలుచుకుంటున్నారు. అలాగే ‘సరైనోడు’, ‘పుష్ప’ సినిమాలలో అల్లు అర్జున్ (Allu Arjun) పాత్ర కూడా ఈ ట్యాగ్‌కి అర్హమైనదే. ‘ఛత్రపతి’, ‘రెబల్’, ‘మున్నా’తో ప్రభాస్ (Prabhas)... ‘పోకిరి’తో మహేష్ (Mahesh).. ఇలా సినిమాని, పాత్రను బట్టి ప్రతి హీరోకు ఈ ట్యాగ్ అర్హమైనదే. అంతేకానీ.. రెండు మూడు సినిమాలలో మాస్ పాత్రలు చేశాం కాబట్టి.. ఆ ట్యాగ్ మాదే అని చెప్పుకోవడం అవివేకమే అవుతుంది. ఇది మెగా, నందమూరి అభిమానులు (Mega and Nandamuri Fans) గమనిస్తే బాగుంటుంది. లేదంటే ‘మారండ్రా బాబు’ అని ఇతర హీరోల ఫ్యాన్స్ నవ్వుకుంటూనే ఉంటారు.

Updated Date - 2022-09-15T04:01:46+05:30 IST