Mega ‘154’: మాస్ మహారాజా తప్పుకున్నట్టేనా..?

ABN , First Publish Date - 2022-05-03T14:48:57+05:30 IST

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా డివైడ్ టాక్‌తో అభిమానులను, ప్రేక్షకులను కాస్త నిరాశపర్చిన

Mega ‘154’: మాస్ మహారాజా తప్పుకున్నట్టేనా..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా డివైడ్ టాక్‌తో అభిమానులను, ప్రేక్షకులను కాస్త నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆచార్య సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తరువాత సినిమాపై పడినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న చిత్రాల్లో మెగా 154 ఒకటి. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు వైరల్‌గా మారింది. మెగా 154లో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇందుకోసం పారితోషికం కూడా భారీగానే ఇస్తునట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆచార్య ఎఫెక్ట్ వల్ల భారీ రెమ్యునరేషన్‌ను రవితేజకు ఇవ్వలేమని నిర్మాణ సంస్థ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రవితేజకు బదులుగా ఓ యంగ్ హీరోను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, దర్శకుడు బాబీ కూడా మెగా 154 బడ్జెట్ విషయంలో చాలా జగ్రత్తలు తీసుకుంటున్నాడట. మరి ఈ సినిమా నుంచి రవితేజ తప్పుకుంది ఎంతవరకు నిజమో అధికారికంగా కన్‌ఫర్మేషన్ వస్తేగానీ నమ్మలేము. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. 

Updated Date - 2022-05-03T14:48:57+05:30 IST