మీరా జాస్మిన్.. అసలేం మారలేదుగా..! ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2022-02-05T04:10:05+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ‘గుడుంబా శంకర్’ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న సమయంలోనే పెళ్లి చేసుకుని

మీరా జాస్మిన్.. అసలేం మారలేదుగా..! ఫొటోలు వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ‘గుడుంబా శంకర్’ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న సమయంలోనే పెళ్లి చేసుకుని.. నటనకు దూరంగా ఉన్న మీరా జాస్మిన్.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోందంటే.. అసలు ముందు ఆమె ఇప్పుడెలా ఉందో అనే సందేహమే అందరికీ వస్తుంది. అలాంటి అనుమానాలున్న వారందరూ ఆశ్చర్యపోయేలా తాజాగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ప్రస్తుతం ఒకప్పటి హీరోయిన్ల మాదిరే.. ఏ అత్త, అక్క, పిన్ని వంటి పాత్రలు వేస్తుందిలే అని మీరా జాస్మిన్ పునరాగమనంపై కామెంట్స్ చేసిన వారందరూ.. ‘వావ్’ అనే రేంజ్‌లో ఈ ఫొటోలు ఉన్నాయంటే అందులో డౌటనేదే అక్కరలేదు. ఆమెను చూస్తుంటే మళ్లీ హీరోయిన్‌గానే అవకాశాలు వచ్చినా రావచ్చు అనేలా.. కుర్ర హీరోయిన్ మాదిరిగా ఈ ఫొటోల్లో మీరా ఉంది. గ్లామర్‌కు సై అనేలా.. ఆమె ఇచ్చిన ఫోజులపై ఇప్పుడు హాట్ హాట్‌గా కామెంట్స్ నడుస్తున్నాయి. నిజంగానే ఈ ఫొటోలు చూస్తుంటే.. మళ్లీ హీరోయిన్‌గానే అనేలా ఇండస్ట్రీకి ఆమె గ్లామర్ పదును సైగలు చేస్తున్నట్లుంది కదా!



Updated Date - 2022-02-05T04:10:05+05:30 IST