Indiradevi last rites: తల్లి అంత్యక్రియలు చేయనున్న మహేష్, మీడియాకి అనుమతి లేదు

Twitter IconWatsapp IconFacebook Icon
Indiradevi last rites: తల్లి అంత్యక్రియలు చేయనున్న మహేష్, మీడియాకి అనుమతి లేదు

ఇంకా కొన్ని గంటల్లో ఇందిరా దేవి (Indiradevi) పార్థివ దేహాన్ని, మహాప్రస్థానం (Mahaprasthanam) కి తరలించనున్నారు. మహేష్ బాబు కొడుకుగా తల్లికి అంత్యక్రియలు (Mahesh Babu will do the last rites) చేయనున్నాడు. అంత్యక్రియలకి (Last rites) ఒక్క కుటుంబ సబ్యులని మాత్రమే అనుమతిస్తారని, మీడియా (media not allowed) వారికీ అనుమతి లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందిరాదేవి వయసు 80 ఏళ్ళు (Indiradevi age), ఆమె కొంతకాలం నుండి అనారోగ్యం (Indiradevi health) తో వున్నారు. కేవలం చక్రాల కుర్చీ కె పరిమితం అయిపోయారు. గత వారం ఆమెకి అనారోగ్యం (Health issues) గా వుంది అని చెప్పటం తో ఆసుపత్రిలో జాయిన్ చేసారు, రెండు రోజుల తరువాత డిశ్చార్జ్ కూడా చేసారు. అభిమానులు ఆమె క్షేమంగా వుంది అనుకున్నారు కానీ, మళ్ళీ ఈరోజు బుధవారం ఆమె మరణ వార్త వినవలసి వచ్చింది.

Indiradevi last rites: తల్లి అంత్యక్రియలు చేయనున్న మహేష్, మీడియాకి అనుమతి లేదు

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) సినిమాలకి రాక ముందే ఇందిరాదేవి ని వివాహం చేసుకున్నారు. కృష్ణ, ఇందిరాదేవి ల వివాహం 1961 (Krishna married Indiradevi in 1961) లో జరిగింది. ఆమె ఒక్కర్తే ఆమె కుటుంబం నుండి వున్నారు, ఆమె అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు ఎవరూ లేరని తెలిసింది. వివాహం అయినా తరువాత కృష్ణ సినిమాలు చెయ్యడానికి చెన్నై (Chennai) రావటం అక్కడ తన ప్రయత్నాలు చెయ్యటం మొదలు పెట్టాడు. ఆలా చేస్తున్న సమయం లోనే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు (Adurti Subba Rao) తన సినిమా 'తేనె మనసులు' (Thene Manasulu) కొత్తవాళ్లతో తీయాలన్న ఉద్దేశం తో పేపర్ లో ప్రకటన ఇవ్వటం, ఆ సినిమాకి కృష్ణ ఒక లీడ్ యాక్టర్ గా సెలెక్ట్ అవ్వటం జరిగింది. అప్పటికే రమేష్ బాబు (Mahesh Babu brother Ramesh Babu) జన్మించటం, ఇంకా ఇందిరా కృష్ణలు చెన్నై లోనే (Indiradevi Krishna) కాపురం పెట్టడం జరిగింది. ఇందిరాదేవి ఎక్కువ కాలం చెన్నై లోనే గడిపారు. సినీ ప్రముఖులు, కుటుంభం సభ్యులు ఇందిరాదేవి కి నివాళులు అర్పించారు. కృష్ణ, ఇందిర మనవరాలు (Indiradevi granddaugher), మహేష్ బాబు (Mahesh Babu daughter) కూతురు సితార ఘట్టమనేని (Sithara emotional) వెక్కి వెక్కి ఏడవటం చూసి, ఆ చిన్నారి పాపకి నాయనమ్మకు వున్న అనుబంధం ఎంత బలమయినదో తెలియచేస్తోంది. సితార ఏడుస్తున్న వీడియో (Sitara crying video) కూడా చాల వైరల్ అయింది. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.