చక్కని చిలుకా చల్
ABN , First Publish Date - 2022-11-26T07:00:20+05:30 IST
విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్టి కుస్తీ’. రవితేజతో కలసి విష్ణువిశాల్ నిర్మించారు.
విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్టి కుస్తీ’. రవితేజతో కలసి విష్ణువిశాల్ నిర్మించారు. డిసెంబరు 2న విడుదలవుతోంది. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. ఈ చిత్రం నుంచి ‘చల్ చక్కని చిలక’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. హీరో, హీరోయిన్ల పెళ్లి నేపథ్యంలో సాగే ఈ గీతానికి రెహమాన్ చక్కని సాహిత్యం అందించారు. జస్టిన్ ప్రభాకరన్ వినసొంపైన స్వరాలు అందించారు. హేమచంద్ర మనసుకు హత్తుకునేలా ఆలపించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్