హీరోగా మాస్ మహారాజ కొడుకు ఎంట్రీ ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2022-04-27T15:27:48+05:30 IST

హీరోగా మాస్ మహారాజ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తాజాగా సోషల్ మీడియాలో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో ఆయన తనయుడు మహాధన్‌ కనిపించాడు.

హీరోగా మాస్ మహారాజ కొడుకు ఎంట్రీ ఎప్పుడంటే..!

హీరోగా మాస్ మహారాజ కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తాజాగా సోషల్ మీడియాలో న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్‌లో ఆయన తనయుడు మహాధన్‌ కనిపించాడు. అప్పటినుంచి రవితేజ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో రవితేజ కూడా క్లారిటీ ఇచ్చారు. మహాధన్‌ చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని తెలిపారు. అయితే, తాజా సమాచారం మేరకు కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని మహాధన్‌తో చేసేందుకు రవితేజను సంప్రదించారట. 


కథ నచ్చడంతో రవితేజ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 'రాజా ది గ్రేట్‌' సినిమాతో రవితేజకు సాలీడ్ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తాడని టాక్. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా, రవితేజ ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బయట నిర్మాణ సంస్థలతో కలిసి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2022-04-27T15:27:48+05:30 IST