మాస్‌ హీరో ఇమేజ్‌ దక్కింది

ABN , First Publish Date - 2022-06-27T10:06:06+05:30 IST

‘‘మాస్‌ హీరోగా మెప్పించాననే పేరు ‘చోర్‌బజార్‌’ చిత్రంతో నాకు దక్కింది. ఆకాష్‌ హీరోగా జనాల్లోకి వెళ్లిపోయాడు అనే ప్రశంసలు దక్కుతున్నాయి’ అని ఆకాష్‌ పూరి...

మాస్‌ హీరో ఇమేజ్‌ దక్కింది

‘‘మాస్‌ హీరోగా మెప్పించాననే పేరు ‘చోర్‌బజార్‌’ చిత్రంతో నాకు దక్కింది. ఆకాష్‌ హీరోగా జనాల్లోకి వెళ్లిపోయాడు అనే ప్రశంసలు దక్కుతున్నాయి’ అని ఆకాష్‌ పూరి అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘చోర్‌బజార్‌’ చిత్రం సక్సెస్‌మీట్‌ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్‌ పూరి మాట్లాడుతూ ‘సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. నా గతచిత్రాల కన్నా ‘చోర్‌బజార్‌’ గ్రాండ్‌గా ఉందని చెబుతున్నారు. ఆ ఘనత మా దర్శకుడు జీవన్‌రెడ్డిదే’ అని అన్నారు. ఈ సినిమా కోసం మేం పడిన కష్టానికి ప్రేక్షకులు మంచి హిట్‌ ఇవ్వడం ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత వీఎస్‌ రాజు అన్నారు. ఒక కలర్‌ఫుల్‌ కమర్షియల్‌ చిత్రం చేయాలన్న మా ప్రయత్నం ‘చోర్‌బజార్‌’తో సక్సెస్‌ అయింది, ఇకపై మంచి కమర్షియల్‌ చిత్రాలు చేస్తాను అని జీవన్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2022-06-27T10:06:06+05:30 IST