మార్వెల్ మాత్రికుడికి అరుదైన గౌరవం.. సోదరిని గుర్తు చేసుకుంటూ..

ABN , First Publish Date - 2022-03-01T21:06:22+05:30 IST

‘అవెంజర్స్’.. ఈ సిరీస్ సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలు అంతగా..

మార్వెల్ మాత్రికుడికి అరుదైన గౌరవం.. సోదరిని గుర్తు చేసుకుంటూ..

‘అవెంజర్స్’.. ఈ సిరీస్ సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలు అంతగా అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశాయి. అలాగే ఆ సిరీస్ మూవీస్‌లో డాక్టర్ స్ట్రేంజ్‌ అనే మాంత్రికుడి పాత్రలో నటించిన బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ కూడా ఫ్యాన్స్‌ను అదే స్థాయిలో అలరించాడు. తాజాగా ఈ నటుడికి హలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనే అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బెనెడిక్ట్ మీడియాని ఉద్దేశించి మాట్లాడాడు.


ముందుగా.. తన పేరు చెక్కిన స్టార్‌పై బెనెడిక్ట్ కాలుపెట్టి, తర్వాత దాన్ని చేతితో తాకాడు. దీనికోసం ఈ 45 ఏళ్ల నటుడు తన భార్య సోఫీ హంటర్, ‘పవర్ ఆఫ్ ది డాగ్’ కో స్టార్ కోడి స్మిట్ మెక్‌ఫీతో కలిసి పాల్గొన్నాడు. అనంతరం బెనెడిక్ట్ మాట్లాడుతూ.. ‘గతేడాది నా సోదరి చనిపోయింది. తనుంటే ఎంతో సంతోషించేది. తను నాకు ఎంతో విధేయతగా ఉంటూ మద్దతుగా నిలిచింది. తన ఎప్పుడూ నవ్వుతూ కళగా, అందంగా ఉండేది. తను ఇది చూస్తే సంతోషంతో కన్నీరు పెట్టేది’ అంటూ చెప్పుకొచ్చాడు.


అనంతరం ఉక్రెయిన్‌పై రష్యా దాడిని బెనెడిక్ట్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవితంలోనే ఎంతో అద్భుతమైన రోజు ఇది. ఇలాంటి సమయంలో, ఇలాంటి గౌరవప్రదమైన చోట ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మాట్లాడకుండా ఉండడం సమజసం కాదు. నేను ఈ వేదికపై ఉక్రెయిన్ ప్రజలకి, ఈ యుద్ధం జరగకూడదని రష్యాలో నిరసన తెలిపిన వారికి నా మద్ధతు తెలుపుతున్నాను’ అని చెప్పాడు. అలాగే వాతావరణ మార్పులు, కోవిడ్ 19 వల్ల కలిగిన నష్టాలపై కూడా బెనెడిక్ట్ మాట్లాడాడు.


అయితే, బీబీసీ సిరీస్ ‘షెర్లాక్’లో షెర్లాక్ హోమ్స్‌గా ప్రజాదరణ పొందిన బెనెడిక్ట్ అనంతరం  జేన్ కాంపియన్ ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’లో నటనకి ఆస్కార్‌కు నామినేషన్ పొందాడు. కాగా.. ఆయన నటించిన తాజా చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్’ మే 6న థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - 2022-03-01T21:06:22+05:30 IST