Vijay Deverakonda: రౌడీ హీరో అతని కాళ్లు ఎందుకు మొక్కాడు?

ABN , First Publish Date - 2022-08-30T01:40:21+05:30 IST

యాటిట్యూడ్‌కి కేరాఫ్ అడ్రెస్‌లా ఉండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ముంబైలోని మరాఠా మందిర్ (Maratha Mandir) థియేటర్ ఓనర్ కమ్ డిస్ట్రిబ్యూటరైన మనోజ్ దేశాయ్ (Manoj Desai) కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో

Vijay Deverakonda: రౌడీ హీరో అతని కాళ్లు ఎందుకు మొక్కాడు?

యాటిట్యూడ్‌కి కేరాఫ్ అడ్రెస్‌లా ఉండే రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ముంబైలోని మరాఠా మందిర్ (Maratha Mandir) థియేటర్ ఓనర్ కమ్ డిస్ట్రిబ్యూటరైన మనోజ్ దేశాయ్ (Manoj Desai) కాళ్లు మొక్కడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. విజయ్ ఎవరి కాళ్లో ఎందుకు పట్టుకోవాల్సి వచ్చందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే... మైక్ దొరకగానే అగ్రెసివ్‌గా మాట్లాడే విజయ్ దేవరకొండ, రీసెంట్‌గా ‘లైగర్’ (Liger) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ఒక ప్రెస్‌మీట్‌కి అటెండ్ అయ్యాడు. ఈ ప్రెస్‌మీట్‌లో... బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ గురించి మాట్లాడుతూ... ‘‘మా కా ఆశిర్వాద్ హై, భగవాన్ కా బ్లెసింగ్ హై, ఫ్యాన్స్ కా సపోర్ట్ హై... అందర్ ఆగ్ హై, కౌన్ రోకేగా దేఖ్ లేంగే’’ అన్నాడు. ఈ మాటలు బాలీవుడ్ సినీ అభిమానులని రెచ్చగొట్టేలా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. 


విజయ్ చేసిన ఈ కామెంట్స్ గురించే మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ... ‘సినిమా ఇండస్ట్రీకి నువ్వు అనకొండ.. నీవు బంగారు కొండవు కాదు’ అని మండిపడ్డారు. ‘అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా?’ అంటూ విరుచుకుపడ్డారు. ‘సినిమాను బాయ్ కాట్ చేస్తే చేయనివ్వండి అని మాట్లాడటం వల్ల థియేటర్ ఓనర్లకు ఇబ్బంది కలుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌పై ప్రభావం పడింది. నీ మాటల్లో పొగరు, అహంకారం ఉంది. వినాశకాలే విపరీత బుద్ది అంటారు. మిస్టర్ విజయ్.. నీవు చాలా దూకుడుగా పెరిగినట్టు ఉన్నావు. మీరు చూడకపోతే చూడకండి అని అనడంలో అహంకారం కనిపిస్తున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కానీ నీ మాటలు సినిమాకు చేటు కలిగించేలా ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్స్ గురించి నెగెటివ్ కామెంట్ చేయకు’’ అంటూ గట్టిగానే రిప్లయ్ ఇచ్చాడు. మనోజ్ దేశాయ్ మాటలు అటు తిరిగి, ఇటు తిరిగి విజయ్ వరకూ వెళ్ళినట్లు ఉన్నాయి... రీసెంట్‌గా విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి మరీ మనోజ్ దేశాయ్‌ని కలిశాడు. (Manoj Desai and Vijay Deverakonda) 


తాను మాట్లాడిన విషయం గురించి పూర్తి వీడియో చూపిస్తూ.. తను ఎలాంటి రాంగ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వలేదనే క్లారిటీ ఇచ్చాడు. దీంతో మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండకు సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వీడియోలో తను చూసిన క్లిప్పింగ్ పూర్తిగా లేదని, అందుకే అలాంటి మాటలు అన్నాను అని... తప్పుగా అర్థం చేసుకున్నందుకు విజయ్‌కి సారీ చెబుతున్నాను అని మనోజ్ దేశాయ్ చెప్పాడు. ఈ సందర్భంగా మీరు సారీ చెప్పకూడదంటూ విజయ్ దేవరకొండ ఆయన కాళ్లకు మొక్కాడు. ఇది వైరల్ అవుతున్న వీడియో వెనకున్న అసలు స్టోరీ. 

Updated Date - 2022-08-30T01:40:21+05:30 IST