మరెన్నో ఘనతలు ఎదురుచూస్తున్నాయి

ABN , First Publish Date - 2022-09-29T05:43:33+05:30 IST

చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌ హీరోగా 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రం ‘చిరుత’ నుంచి...

మరెన్నో ఘనతలు ఎదురుచూస్తున్నాయి

చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్‌ హీరోగా 15 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. తొలి చిత్రం ‘చిరుత’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకూ... ఒక్కో చిత్రంతో తన స్థాయిని పెంచుకుంటూ ఇప్పుడు పాన్‌  ఇండియా హీరోగా ఎదిగి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. పుత్రోత్సాహాన్ని చిరంజీవి మెగా అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్‌లో రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘చిరుత, మగధీర, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్‌’...ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో ‘ఆర్‌ సి 15’ వరకూ రామ్‌చరణ్‌ నటుడిగా తనను తాను మలచుకుంటూ ఎదిగిన తీరు ఎంతో బాగుంది. తన పని, అకింత భావం చూస్తుంటే సంతోషంగా ఉంది. చరణ్‌ మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలి. నా కొడుకును చూసి గర్విస్తున్నాను. సాధించాల్సిన మరెన్నో ఘనతలు నీకోసం ఎదురుచూస్తున్నాయి. కచ్చితంగా నువ్వు సాధిస్తావు’ అని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌తో కలసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. 


Updated Date - 2022-09-29T05:43:33+05:30 IST