యాక్షన్ పాత్రలో Manushi Chhillar..!

ABN , First Publish Date - 2022-07-11T01:23:35+05:30 IST

‘మిస్ యూనివర్స్-2017’ టైటిల్‌ను గెలుచుకుని అభిమానుల మనసు దోచుకున్న అందాల భామ మానుషి చిల్లర్ (Manushi Chhillar). ఈ మధ్యనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat

యాక్షన్ పాత్రలో Manushi Chhillar..!

‘మిస్ యూనివర్స్-2017’ టైటిల్‌ను గెలుచుకుని భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన అందాల భామ మానుషి చిల్లర్ (Manushi Chhillar). ఈ మధ్యనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj)లో నటించింది. ఈ చిత్రంలో అభినయంతో అందరిని అలరించింది. త్వరలోనే విక్కీ కౌశల్ (Vicky Kaushal)తో కలసి మరో సినిమా చేయనుంది. ‘ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ (The Great Indian Family)లో కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టక ముందే మానుషి మరో ప్రాజెక్టులో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే ఒకే చెప్పిందని బాలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


మానుషి చిల్లర్ నటించబోయే సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తెలియడం లేదు. ‘‘ఈ సినిమాలో మానుషి చిల్లర్ యాక్షన్ పాత్రలో కనపించనుంది. షూటింగ్‌ను ఎక్కువ భాగం బ్రిటన్, ఫ్రాన్స్, యూరప్‌లోని ఇతర ప్రాంతాల్లో జరపనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో ఆమె కొత్తగా కనిపించనుంది. యాక్షన్ పాత్రలో దర్శనమివ్వనుంది. ఈ పాత్ర కోసం ఆమె కొంచెం కష్టపడక తప్పదు’’ అని చిత్ర బృందంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి చెప్పారు. మానుషి చిల్లర్ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ లో సంయోగితగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించాడు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది.  ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర విజయం సాధించలేదు.

Updated Date - 2022-07-11T01:23:35+05:30 IST