సరికొత్తగా ‘మను చరిత్ర’

ABN , First Publish Date - 2022-08-10T05:39:01+05:30 IST

శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాశ్‌, ప్రియ వడ్లమాని కథానాయికలు.

సరికొత్తగా ‘మను చరిత్ర’

శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘా ఆకాశ్‌, ప్రియ వడ్లమాని కథానాయికలు. భరత్‌ పెదగాని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నరాల శ్రీనివాస్‌ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హక్కుల్ని శంకర్‌ పిక్చర్స్‌ దక్కించుకొంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కథ, కథనాలతో సాగే చిత్రమిది. లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ తెచ్చుకొన్న శివ కందుకూరిని సరికొత్తగా చూపించబోతున్నాం. గోపీ సుందర్‌ బాణీలు ఆకట్టుకొంటాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు. ప్రగతి శ్రీవాత్సవ్‌, సుహాస్‌, డాలి ధనుంజయ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, మధునందన్‌, రఘు, దేవీ ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు.

Updated Date - 2022-08-10T05:39:01+05:30 IST