Manoj Bajpayee: బాలీవుడ్ సినిమాలకు చెడు దశ కొనసాగుతుంది.. మనం ఎక్కువగా ఆశిస్తున్నాం..

ABN , First Publish Date - 2022-08-22T21:43:13+05:30 IST

Manoj Bajpayee: బాలీవుడ్ సినిమాలకు చెడు దశ కొనసాగుతుంది.. మనం ఎక్కువగా ఆశిస్తున్నాం..

Manoj Bajpayee: బాలీవుడ్ సినిమాలకు చెడు దశ కొనసాగుతుంది.. మనం ఎక్కువగా ఆశిస్తున్నాం..

బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. విడుదలయిన చిత్రాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకో‌లేకపోతున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. స్టార్ హీరోల మూవీస్ అందుకు మినహాయింపేమీ కాదు. అవి కూడా పరాజయాల బాటలోనే పయనిస్తున్నాయి. ఆసక్తికర కంటెంట్ లేకపోవడం కూడా అందుకు ప్రధాన లోపం. ఈ మధ్యనే థియేటర్స్‌లో విడుదలైన ఆమిర్ ఖాన్ (Aamir Khan) ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘రక్షాబంధన్’ (Raksha Bandhan) బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. దీంతో సినిమాల పరాజయంపై బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అనేక మంది సెలబ్రిటీలు కూడా తమ స్పందనను తెలుపుతున్నారు. బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) తాజాగా ఈ విషయంపై స్పందించాడు.  


‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో ప్రేక్షకులకు చేరువైన మనోజ్ బాజ్‌పాయ్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. ‘‘ఇండస్ట్రీ ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. సినిమాలనేవి చచ్చిపోవు. హిందీ చిత్రాలనేవి అస్సలు మరణించవు. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలకు చెడు దశ కొనసాగుతుంది. దీన్ని నుంచి కూడా మనం ఎక్కువగా ఆశిస్తున్నాం. పరిస్థితులన్ని త్వరలోనే సర్దుకుంటాయి. సినిమాలన్ని విజయాల బాటలో పయనిస్తాయి. హిందీ చిత్రాలకు మంచి రోజులు త్వరలోనే వస్తాయి. కథలో కూడా ఎటువంటి లోపాలు ఉండటం లేదు. కొన్ని దిద్దుబాట్లు జరగాలి’’ అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పాడు. తన కెరీర్‌లో కొనసాగిన దారుణమైన దశ గురించి కూడా మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడాడు. ‘‘ముంబైకీ వచ్చిన తర్వాత నాకు ఎక్కడ పని లభించలేదు. పూట గడవాలంటే ఏదో ఒక పని చేయక తప్పదు. ఆ సమయం నాకు కష్టతరమైనది. నా జేబులో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ నాలుగు నుంచి ఐదేళ్లు నా కెరీర్‌లోనే ఘోరంగా గడిచింది’’ అని మనోజ్ పేర్కొన్నాడు.   

Updated Date - 2022-08-22T21:43:13+05:30 IST