‘బంగార్రాజు’ దర్శకుడు వదిలిన ‘మ‌ణిశంక‌ర్’ టీజ‌ర్‌

ABN , First Publish Date - 2022-03-20T00:15:16+05:30 IST

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్డే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. డ‌బ్బు చుట్టూ తిరిగే క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా దర్శకుడు జి.వి.కె(జి. వెంక‌ట్‌కృష్ట‌ణ్‌) తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ..

‘బంగార్రాజు’ దర్శకుడు వదిలిన ‘మ‌ణిశంక‌ర్’ టీజ‌ర్‌

శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్డే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘మణిశంకర్’. డ‌బ్బు చుట్టూ తిరిగే క‌థ‌-క‌థ‌నాల‌తో యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫ‌రెంట్ మూవీగా దర్శకుడు జి.వి.కె(జి. వెంక‌ట్‌కృష్ట‌ణ్‌) తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను ‘బంగార్రాజు’ చిత్ర దర్శకుడు క‌ళ్యాణ్ కృష్ణ విడుద‌ల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 


ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మ‌ణిశంక‌ర్ పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ చూశాను. చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌ నేపథ్యంలో ద‌ర్శ‌కుడు జీవీకే ఈ స్క్రిప్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. రియ‌లెస్టిక్‌గా ఉంది. ఈ సినిమా మంచి స‌క్సెస్ సాధించి జీవీకే, శివ గారి కెరీర్‌కు హెల్ప్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను..’’ అన్నారు. ‘‘క‌ళ్యాణ్ కృష్ణ‌గారు మంచి పాజిటీవ్ యాటిట్యూట్ ఉన్న డైరెక్ట‌ర్. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకునే మంచి మ‌న‌సున్న వ్య‌క్తుల్లో ప్ర‌ముఖుడు. మా మ‌ణిశంక‌ర్ మూవీ టీజ‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ‌గారి చేతుల‌మీదుగా విడుదలవడం చాలా హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు జీవీకే తెలుపగా హీరో శివ కంఠ‌మ‌నేని మాట్లాడుతూ.. ‘‘టీజ‌ర్ త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాం. మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌. మ‌ణిశంక‌ర్ అనే ఒక పెద్ద గ్యాంగ్‌స్ట‌ర్ చేసే కొన్ని డీలింగ్స్‌కి సంబంధించిన క‌థ‌. త‌ప్ప‌కుండా ఈ చిత్రంతో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది’’ అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-03-20T00:15:16+05:30 IST