Ponniyin Selvan I: విడుదలకి ముందే కమల్ హాసన్ సూపర్ హిట్ ‘విక్రమ్’ రికార్డు బద్దలు.. ఏ విషయంలో అంటే..

ABN , First Publish Date - 2022-09-28T17:20:49+05:30 IST

మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’. ఎన్నో ఏళ్లుగా ఈ మూవీని తెరకెక్కించాలని ఈ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు...

Ponniyin Selvan I: విడుదలకి ముందే కమల్ హాసన్ సూపర్ హిట్ ‘విక్రమ్’ రికార్డు బద్దలు.. ఏ విషయంలో అంటే..

మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’. ఎన్నో ఏళ్లుగా ఈ మూవీని తెరకెక్కించాలని ఈ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), జయం రవి, ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), త్రిష (Trisha), శోభిత దూళిపాళ ముఖ్యపాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


ఈ తరుణంలోనే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. నివేదికల ప్రకారం.. తమిళనాడులో ఇప్పటికే దాదాపు 2.5 లక్షల టిక్కెట్లు ఆన్లైన్‌లో బుక్ అయ్యాయంట. అంటే అది దాదాపు రూ. 4.5 కోట్లకి సమానం. ఈ ఏడాదిలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈ మూవీకి ముందు అజిత్ ‘వలిమై’, విజయ్ ‘బీస్ట్’ మాత్రమే ఉన్నాయి. 


అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా ఈ మూవీ కమల్ హాసన్ (Kamal Haasan) సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షనని దాటేసిందని తెలుస్తోంది. కమల్ మూవీ విడుదలైన మొదటి రోజు రూ.21.80 కోట్లని కలెక్ట్ చేయగా.. ‘పొన్నియిన్ సెల్వన్ I’ మూవీ దాదాపు రూ.25 కోట్లు కలెక్ట్ చేసిందని వినిపిస్తోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన సూపర్ హిట్ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కుతుండడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఐదు భాగాలుగా వచ్చిన ఈ మూవీని రెండు భాగాలుగా కుదించి సినిమాగా తీసేందుకు మణిరత్నం ప్లాన్ చేశాడు.


దీని గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, సినీ విమర్శకుడు రమేశ్ బాలా ఓ ట్వీట్ కూడా చేశాడు. ఆయన చేసిన ట్వీట్‌లో.. ‘దశాబ్దాలుగా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచిన నవల పొన్నియిన్ సెల్వన్. ఐదు భాగాలుగా వచ్చిన ఈ నవల ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఆ ఐదు భాగాల్లోని మంచి సన్నివేశాలను తీసుకుని దర్శకుడు మణిరత్నం ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందుకే తమిళనాడుతోపాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న తమిళులు ఈ మూవీ రివ్యూల కోసం  ఎదురు చూడకుండానే.. వెళ్లి సినిమా చూస్తారు’ అని రాసుకొచ్చాడు. కాగా.. ఈ మూవీ తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.



Updated Date - 2022-09-28T17:20:49+05:30 IST