‘గాలి నాగేశ్వరరావు’గా మంచు హీరో

ABN , First Publish Date - 2022-03-05T03:03:20+05:30 IST

‘గాలి నాగేశ్వరరావు’గా మంచు హీరో మారబోతున్నారు. మంచు విష్ణు హీరోగా కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి వారి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో ‘గాలి నాగేశ్వరరావు’గా కనిపించబోతున్నట్లుగా తెలుపుతూ..

‘గాలి నాగేశ్వరరావు’గా మంచు హీరో

‘గాలి నాగేశ్వరరావు’గా మంచు హీరో మారబోతున్నారు. కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి వారి కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో తను ‘గాలి నాగేశ్వరరావు’గా కనిపించబోతున్నట్లుగా తెలుపుతూ.. మంచు విష్ణు సోషల్ మీడియాలో తెలియజేశారు. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించనున్నారు. 


ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా చోటా. కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నట్లుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జి. నాగేశ్వరరెడ్డి స్ర్కిఫ్ట్ అందిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు ఇప్పటి వరకు చేయని పాత్రను చేయబోతున్నట్లుగా ఆయన విడుదల చేసిన స్కెచ్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది.

Updated Date - 2022-03-05T03:03:20+05:30 IST