Manchu Vishnu: నా మీద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు

ABN , First Publish Date - 2022-09-29T20:33:13+05:30 IST

ట్రోల్స్ (Trolls) గురించి మాట్లాడుతూ ఒక పెయిడ్ బ్యాచ్ (Paid Batch) వుంది అని చెప్పాడు విష్ణు. సైబర్ పోలీస్ (Cyber Police) కి కంప్లెయింట్ (Complaint) ఇచ్చామని, వాళ్ళు రెండు ఐపి అడ్రస్ (IP Address) లు ఇచ్చారని చెప్పాడు

Manchu Vishnu: నా మీద ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు

మంచు విష్ణు (Manchu Vishnu) తాను నటిస్తున్న  'జిన్నా' (JInna) సినిమా అక్టోబర్ 21న (October 21 release date) విడుదల అవుతుందని ప్రకటించాడు. అక్టోబర్ 5 న ట్రైలర్ (Trailer on October 5) విడుదల చేస్తామని, సినిమా అక్టోబర్ 21న అని చెప్పాడు విష్ణు. ఈ సినిమాకి వి ఎఫ్ ఎక్స్ (VFX) అవసరం ఉందని, అందువల్ల అక్టోబర్ 21 మంచి తేదీ అని ఆరోజు విడుదల చేస్తున్నామని చెప్పాడు. అలాగే థియేటర్స్ కూడా ఆ రోజుకి ఎక్కువ దొరుకుతాయని చెప్పాడు. 

ట్రోల్స్ (Trolls) గురించి మాట్లాడుతూ ఒక పెయిడ్ బ్యాచ్ (Paid Batch) వుంది అని చెప్పాడు విష్ణు. సైబర్ పోలీస్ (Cyber Police) కి కంప్లెయింట్  (Complaint) ఇచ్చామని, వాళ్ళు రెండు ఐపి అడ్రస్ (IP Address) లు ఇచ్చారని, అందులో ఒకటి జూబిలీ హిల్స్ లో (Jubilee Hills office) వున్న ఒక ఆఫీస్ అడ్రస్, ఇంకోటి చెక్ పోస్ట్ (Near Check Post) దగ్గర వున్న ఇంకో ఆఫీస్ అడ్రస్ వున్నాయి అని చెప్పాడు. ఒక వాట్స్ అప్ (Wassup group) గ్రూప్ వుంది అందులో వీడియోస్ (Videos), కామెంట్స్ (Comments) పెట్టి ఆలా పోస్ట్ చెయ్యండి అని ఈ పెయిడ్ బ్యాచ్  చెప్తే, అందులో వున్నవాళ్లు అందరూ వెంటనే ఆ వీడియోని, కామెంట్ (Comment) ని బయటకి పోస్ట్ చేస్తున్నారు. ఈ రెండు ఆఫీస్ అడ్రస్ ల నుండే మేజర్ (Major trolls from these two offices) గా వస్తున్నాయని చెప్పారు. అందులో ఒక అడ్రస్ ఒక ప్రముఖ హీరో (belongs to a popular hero) ది అని చెప్పాడు. 



వీటిని కూడా పట్టించుకున్నాను అనుకోండి, ఇండస్ట్రీ లో ఉండనవసరం లేదు. నా మీద ఈ పెయిడ్ బ్యాచ్ ఎందుకు అంత ఇన్వెస్ట్ (Invest) చేస్తున్నారో అర్థం కావటం లేదు, అని అన్నాడు విష్ణు. ఎఫ్ఐఆర్ (FIR) బుక్ అయ్యాక, కోర్ట్ లో (Court) ఈ 18 యూట్యూబ్ చానెల్స్ (18 Youtube Channel names) పేర్లు బయటకి వస్తాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Movie Artiste Association) ఎలెక్షన్స్ (Elections) నుండి ఈ పెయిడ్ ట్రోల్ల్స్ (paid trolls) స్టార్ట్ చేసారని, ఇది ఒక పైసా వసూల్ (Paisa vasool) బ్యాచ్ (Batch) అని, దీన్ని పట్టించుకోనవసరం లేదు అని చెప్పాడు విష్ణు. సినిమా విడుదల ముందే ఇవన్నీ వస్తాయి, ఏమి మాట్లాడినా ట్విస్ట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పాడు. జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనే ఉద్దేశంతో కోర్టుకు వెళుతున్నాం కానీ, లేకపోతే వీళ్ళని లెక్క చేయనవసరం లేదు. పేర్లు (Names) బయటికి వస్తే వాళ్ళ పరువులు పోతాయి. 

Updated Date - 2022-09-29T20:33:13+05:30 IST