GodFather: మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజు.. మంచు విష్ణు ఏం చేశాడో తెలుసా?

Twitter IconWatsapp IconFacebook Icon
GodFather: మెగాస్టార్ సినిమా రిలీజ్ రోజు.. మంచు విష్ణు ఏం చేశాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా.. మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే అదే రోజు మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ఓ పని కూడా ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ రోజు.. మంచు విష్ణు ఏం చేశాడా? అని అనుకుంటున్నారు కదా..! అంత ఆశ్చర్యపోవద్దు.. ఎందుకంటే ఇదేం కాంట్రవర్సీ మ్యాటర్ కాదు. ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్ రోజే మంచు విష్ణు.. తన సినిమా ‘జిన్నా’ (Ginna) ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ‘గాడ్‌ఫాదర్’, ‘దిఘోస్ట్’ (The Ghost) సినిమాలు ఆడుతున్న థియేటర్లలో కూడా ప్లే చేశారు. దీంతో మెగాస్టార్ సినిమాలో మంచు విష్ణు అంటూ నెటిజన్లు కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.


దీనికి కారణం లేకపోలేదు.. ఈ మధ్య కాలంలో మెగా, మంచు కుటుంబాల మధ్య ఎటువంటి వాతావరణం నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్ రోజే ‘జిన్నా’ సినిమాని కూడా విడుదల చేయాలని మంచు విష్ణు ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ‘జిన్నా’ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా తెలిపేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా.. మంచు విష్ణు కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. తనపై, తన కుటుంబంపై ట్రోలింగ్ చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ.. కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. అవి ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆ తర్వాత సెలైంట్ అయిన మంచు విష్ణు.. అక్టోబర్ 5న ట్రైలర్ (Ginna Trailer) వదిలి మరోసారి వార్తలలో నిలిచాడు. దసరా స్పెషల్‌గా విడుదలైన ఈ ట్రైలర్‌ను చూస్తుంటే.. సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అక్టోబర్ 21న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.